సప్తగిరి హీరోగా 'సప్తగిరి సూపర్ ఫాస్ట్' ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
`సప్తగిరి ఎక్స్ ప్రెస్` చిత్రంతో సప్తగిరి హీరోగా తన లో మరో కోణాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. తొలి సినిమాతోనే సప్తగిరి హీరోగా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఆ సక్సెస్ సప్తగిరికి మంచి బూస్ట్ నిచ్చింది. ఆవెంటనే హీరోగా మరో సినిమా `సప్తగిరి ఎల్ ఎల్ బి`ని సెట్స్ పైకీ తీసుకెళ్లి ఔరా అనిపించాడు. దీంతో సప్తగిరి అనే పేరు మార్కెట్ లో ఓ బ్రాండ్ అయింది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో రెట్టించిన ఉత్సాహాంలో ఉన్నాడు. ఆ ఉత్సాహాంలోనే తాజాగా తన పేరుతో `సప్తగిరి సూపర్ ఫాస్ట్` అనే టైటిల్ తో మరో సినిమాను నేడు (శనివారం) ప్రారంభించేశాడు. ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి నూతన అధ్యక్షుడు పర్వతనేని కిరణ్ క్లాప్ నివ్వగా, సీరియర్ రచయిత విజయేంద్ర ప్రసాద్ కెమెరాస్విచ్చాన్ చేశారు. సీనియర్ దర్శకులు బి.గోపాల్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ద్వారా నిర్మాతలుగా నట్టి కరుణ, నట్టి క్రాంతి, నిర్మాతలుగా పరిచయం అవుతున్నారు. నట్టీస్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై జొన్నాడ రమణమూర్తి సమర్పణలో నట్టి కరుణ, నట్టి క్రాంతి, నిర్మిస్తున్నారు.
అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో...
రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ` హర్షవర్ధన్ నా చిరకాల మిత్రుడు. నాతో కలిసి చాలా సినిమాలకు పనిచేశాడు. సప్తగిరి సూపర్ ఫాస్ట్ కథ సిద్దం చేసి నా దగ్గరకు వచ్చి వినిపించి..నా అనుమతి తీసుకుని ప్రారంభించాడు. మంచి కథ. సప్తగిరి కి 100 పర్సంట్ యాప్ట్ అయిన స్టోరీ ఇది. హీరోగా మరో మెట్టు పైకి ఎక్కుతాడు. మరో విధంగా చెప్పాలంటే సప్తగిరిని సూపర్ స్టార్ ని చేసే సినిమా అవుతుంది` అని అన్నారు.
సీనియర్ దర్శకుడు బి.గోపాల్ మాట్లాడుతూ, `హర్షవర్ధన్ మంచి టెక్నిషీయన్. చాలా కాలం తర్వాత మళ్లీ మంచి కథతో సినిమా చేస్తున్నాడు. సినిమా విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకురావాలి` అని అన్నారు.
హీరో సప్తగిరి మాట్లాడుతూ, ` సీనియర్ రచయిత, దర్శకులు విజయేంద్ర ప్రసాద్, బి.గోపాల్ గారు చేతుల మీదుగా మా సినిమా ప్రారంభోత్సవం జరగడం చాలా సంతోషంగా ఉంది. మంచి కంటెంట్ ఉన్న స్టోరీ. కొత్త నిర్మాతలు కరుణ, క్రాంతి పరిచయం అవుతున్నారు. ఈ సినిమా విజయంతో అందరికీ మంచి పేరు రావాలి` అని అన్నారు.
చిత్ర దర్శకుడు హర్షవర్ధన్ మాట్లాడుతూ, ` చాలా గ్యాప్ తర్వాత మళ్లీ సినిమా చేస్తున్నా. అందరికీ నచ్చే కథాంశమిది. కథ రాసుకుని విజయేంద్ర ప్రసాద్ గారి అప్రూవల్ వచ్చిన తర్వాత ప్రారంభించాం. ఆయన జడ్జిమెంట్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. సప్తగిరిని హీరోగా మరో మెట్టు పైకి ఎక్కించే సినిమా అవుతుంది. కొత్త నిర్మాతలిద్దరు సినిమాపై మంచి ఫ్యాషన్ తో ఉన్నారు. వాళ్లకు మంచి పేరు తీసుకొస్తుంది. త్వరలోనే షూటింగ్ వెళ్తాం` అని అన్నారు.
నిర్మాతలు క్రాంతి, కరుణ మాట్లడుతూ, ` మా నాన్నగారు మమ్మల్ని ఈ రంగంలో ప్రోత్సహిస్తుంన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన పేరును నిలబెడుతాం. మమ్మల్ని ..మాటీ మ్ ను నమ్మి సప్తగిరి గారు సినిమా చేస్తున్నందుకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మా చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులంతా ఆదరిస్తారని కోరుకుంటున్నాం` అని అన్నారు.
ఇతర పాత్రల్లో నరేష్, పోసాని కృష్ణ మురళి, డాక్టర్ శివ ప్రసాద్, తనికెళ్ల భరణి, జయ ప్రకాశ్ రెడ్డి, షయాజీ షిండే, రఘుబాబు, శకలర శంకర్, రఘు, ఫిష్ వెంకట్, ప్రగతి, విద్యుల్లేఖ రామన్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్ట్: కె. వి. రమణ, ఎడిటింగ్: గౌతం రాజు, ఫైట్స్: రామ్, లక్ష్మణ్, స్టిల్స్: ఎన్ .రమేష్ కుమార్, కథ, కథనం: హర్షవర్ధన్, ఏ.గోపాల్, నిర్మాతలు: నట్టి కరుణ, నట్టి క్రాంతి
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments