'సప్తగిరి ఎల్ ఎల్ బి' పెద్ద హిట్ అవుతుంది - రామ్ చరణ్
Send us your feedback to audioarticles@vaarta.com
కామెడీ కింగ్ సప్తగిరి కథానాయకుడిగా సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ ప్రై లిమిటెడ్ పతాకంపై చరణ్ లక్కాకుల దర్శకత్వంలో డా.రవికిరణ్ నిర్మిస్తున్న చిత్రం 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 7న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌కి రెడీ అవుతోంది. కాగా, ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ సోమవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో సప్తగిరి, దర్శకుడు చరణ్ లక్కాకుల, సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్, నిర్మాత డా. రవికిరణ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ మాట్లాడుతూ ''సప్తగిరి అంటే నాకు చాలా ఇష్టం. ఇద్దరం కలిసి ఒక సినిమా చేశాం. మెచ్యూర్డ్ కమెడియన్ అతను. చాలా మంచి వ్యక్తి. ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. హిందీ ట్రైలర్ కంటే తెలుగులో బాగా చేశారు. క్వాలిటీగా, చాలా కలర్‌ఫుల్‌గా వుంది. తప్పకుండా సినిమా పెద్ద హిట్ అవుతుంది. పాటలు కూడా చూశాను. చాలా బాగున్నాయి. బుల్గానిన్ మంచి టాలెంట్ వున్న మ్యూజిక్ డైరెక్టర్. గతంలో నా బర్త్‌డేకి ఒక పాట కూడా చేశాడు. ఈ సినిమాని మెగా అభిమానులే కాకుండా మిగతా పెద్ద హీరోల అభిమానులు కూడా చూసి పెద్ద హిట్ చెయ్యాలని, నిర్మాతకు మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
హీరో సప్తగిరి మాట్లాడుతూ ''ఈరోజు చాలా ఆనందంగా వుంది. జీవితంలో ఎదగాలంటే చిరంజీవిగారిని ఆదర్శంగా తీసుకుంటారు. నేను మెగా అభిమానిగా పుట్టడం నా అదృష్టం. ఒక మెగా అభిమాని హీరోగా ఎదగడం కోసం పవన్‌కళ్యాణ్‌గారు, రామ్‌చరణ్‌గారు, సాయిధరమ్ తేజ్‌గారు అందిస్తున్న సహకారాన్ని ఎప్పటికీ నేను మర్చిపోలేను. మెగా అభిమానులందరూ గర్వపడేలా, వారి గౌరవం నిలబెట్టేలా ఈ సినిమా వుంటుంది. 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' ట్రైలర్ రిలీజ్ చెయ్యాల్సిందిగా కోరగానే ఎంతో మంచి మనసుతో అంగీకరించిన రామ్‌చరణ్‌గారికి నా ధన్యవాదాలు'' అన్నారు.
నిర్మాత డా.రవికిరణ్ మాట్లాడుతూ ''ఎంతో బిజీ షెడ్యూల్‌లో వున్నప్పటికీ మాకు టైమ్ కేటాయించి ట్రైలర్ లాంచ్ చేసిన రామ్‌చరణ్‌గారికి ధన్యవాదాలు. రామ్‌చరణ్‌గారు గుడ్ హ్యూమన్ బీయింగ్ అంటారు. అది ఈరోజు కళ్ళారా చూశాను. ఇది నేను జీవితంలో మర్చిపోలేని రోజు'' అన్నారు.
దర్శకుడు చరణ్ లక్కాకుల మాట్లాడుతూ ''మా ట్రైలర్‌ని రిలీజ్ చేసిన మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్‌గారికి చాలా థాంక్స్. 'రచ్చ' సినిమాకి నేను కో డైరెక్టర్‌గా పనిచేశాను. రామ్‌చరణ్‌గారితో సంవత్సరం పాటు ట్రావెల్ చేశాను. లొకేషన్‌లో చాలా జోవియల్‌గా వుంటూ అందరితో సరదాగా మాట్లాడే మంచి మనసున్న వ్యక్తి. చాలా గ్రేట్ పర్సన్. ఆయన ట్రైలర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా వుంది'' అన్నారు.
సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ మాట్లాడుతూ ''రామ్‌చరణ్‌గారి బర్త్‌డే సందర్భంగా ఒక పాట కంపోజ్ చేశాను. ఆ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఆ పాట చూసి చరణ్‌గారు నన్ను ఎంతో మెచ్చుకున్నారు. 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' పాటలు చూసి అప్రిషియేట్ చెయ్యడం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను'' అన్నారు.
డిసెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రంలో కామెడీ కింగ్ సప్తగిరి సరసన కశిష్ వోరా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, సంగీతం: విజయ్ బుల్గానిన్, కో-డైరెక్టర్: రాజశేఖర్‌రెడ్డి పులిచెర్ల, ఫొటోగ్రఫీ: సారంగం ఎస్.ఆర్, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: అర్జున్, పాటలు: చంద్రబోస్, కందికొండ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: భిక్షపతి తుమ్మల, నిర్మాత: డా. రవికిరణ్, దర్శకత్వం: చరణ్ లక్కాకుల.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments