'జాలీ ఎల్.ఎల్.బి.' రీమేక్ లో సప్తగిరి...
Send us your feedback to audioarticles@vaarta.com
కామెడీ కింగ్ సప్తగిరి కథానాయకుడిగా సప్తగిరి ఎక్స్‌ప్రెస వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని నిర్మించిన సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ ప్రై లిమిటెడ్ అధినేత యువ నిర్మాత డా. రవికిరణ్ మళ్లీ సప్తగిరి హీరోగా మరో విభిన్న చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిందీలో సూపర్‌డూపర్ హిట్ అయిన 'జాలీ ఎల్.ఎల్.బి' పార్ట్-1 రైట్స్ ఫ్యాన్సీ ఆఫర్‌తో స్వంతం చేసుకొని 'సప్తగిరి ఎల్.ఎల్.బి' పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్‌లో 5 ఏళ్ళు, సూపర్‌గుడ్ ఫిలింస్‌లో 5 ఏళ్ళు దర్శకత్వశాఖలో పని చేసి డా. డి.రామానాయుడుగారికి, సూపర్‌గుడ్ ఆర్.బి. చౌదరికి ప్రియ శిష్యుడనిపించుకుని 'కలిసుందాం..రా', 'ప్రేయసిరావే', 'నిన్నే ప్రేమిస్తా', 'భీమిలి కబడ్డీజట్టు' 'రచ్చ' వంటి సూపర్‌హిట్ చిత్రాలకు పని చేసి, దిల్ రాజు బేనర్లో 'మిస్టర్ పర్ఫెక్ట్'కి దర్శకత్వశాఖలో వర్క్ చేసిన చరణ్ లక్కాకుల ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
జూన్ 22న సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం ముహూర్తం షాట్‌కి సూపర్ రైటర్ పరుచూరి వెంకటేశ్వరరావు క్లాప్ కొట్టగా, నిర్మాత డా. రవికిరణ్ కుమార్తెలు బేబీ ఐశ్వర్య, బేబీ అస్మిత కెమెరా స్విచాన్ చేయ్యగా, సీనియర్ ఎడిటర్ గౌతంరాజు గౌరవ దర్శకత్వం వహించారు.
'నన్ను ఆశీర్వదించడానికి విచ్చేసిన పెద్దలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు' అని హీరో సప్తగిరి తొలి డైలాగ్ చెప్పారు.
అనంతరం హీరో కామెడీ కింగ్ సప్తగిరి మాట్లాడుతూ - ''నేను హీరోగా నటించిన తొలి చిత్రం 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్'ని మేము ఊహించినదానికంటే పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ విజయం నాకు, నా నిర్మాత రవికిరణ్గారికి ఎంతో బాధ్యతని పెంచింది. అందుకే ఎన్నో కథలు అనుకొని ఫైనల్‌గా హిందీలో సూపర్‌హిట్ అయిన 'జాలీ ఎల్.ఎల్.బి' పార్ట్-1 రైట్స్ తీసుకొని డెఫినెట్‌గా మళ్ళీ సూపర్‌హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఈ సినిమా చేస్తున్నాం. నా కెరీర్లోకి ఇది మరో మంచి సినిమా అవుతుంది'' అన్నారు.
నిర్మాత డా. రవికిరణ్ మాట్లాడుతూ - ''సప్తగిరితో మేము నిర్మించిన తొలి చిత్రం ఎవరూ ఊహించనంత అద్భుత విజయాన్ని సాధించింది. మళ్ళీ సప్తగిరి హీరోగా అంతకంటే పెద్ద హిట్ తియ్యాలని 'జాలీ ఎల్.ఎల్.బి' రైట్స్ తీసుకొని తెలుగులో మనకి అనుగుణంగా కొన్ని మార్పులు చేసుకొని అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవకుండా ఈ 'సప్తగిరి ఎల్.ఎల్.బి' చిత్రాన్ని ప్లాన్ చేశాం. ఈనెల 25 నుండి కంటిన్యూస్‌గా షెడ్యూల్ జరుగుతుంది. మా బేనర్‌కి ఇది మరో పెద్ద హిట్ అవుతుంది'' అన్నారు.
దర్శకుడు చరణ్ లక్కాకుల మాట్లాడుతూ - ''గురువుగారు పరుచూరి వెంకటేశ్వరరావుగారి క్లాప్‌తో ఈ సినిమా ప్రారంభం అయినందుకు ఆనందంగా వుంది. మంచి నిర్మాత డా. రవికిరణ్‌గారు. సక్సెస్ఫుల్ హీరో సప్తగిరి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు. దర్శకుడిగా ఈ చిత్రాన్ని సూపర్‌హిట్ చెయ్యడానికి శాయశక్తులా కృషి చేస్తాను'' అన్నారు.
కామెడీ కింగ్ సప్తగిరి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో షకలక శంకర్, డా. శివప్రసాద్లతో పాటు ప్రముఖ తారాగణం నటిస్తారు.
ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, సంగీతం: విజయ్ బుల్గానిన్, కో-డైరెక్టర్: రాజశేఖర్‌రెడ్డి పులిచెర్ల, ఫొటోగ్రఫీ: సారంగం ఎస్.ఆర్, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: అర్జున్, పాటలు: చంద్రబోస్, కందికొండ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: భిక్షపతి తుమ్మల, నిర్మాత: డా. రవికిరణ్, దర్శకత్వం: చరణ్ లక్కాకుల.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com