ఎన్టీఆర్ టైటిల్‌తో సప్తగిరి..
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ ఎన్టీఆర్ నటించిన సూపర్‌హిట్ చిత్రాల్లో 'గజదొంగ' ఒకటి. ఇప్పుడు అదే టైటిల్‌తో సప్తగిరి కథానాయకుడిగా ఓ సినిమా రూపొందనుంది. అయితే ఆ చిత్రానికి దీనికి సంబంధం లేదంటున్నారు యూనిట్ సభ్యులు.
'సప్తగిరి ఎక్స్ ప్రెస్', 'సప్తగిరి ఎల్.ఎల్.బి' చిత్రాలతో హీరోగా ఓ స్థానాన్ని ఏర్పరుచుకున్న సప్తగిరి చేస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. డి.రామకృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
విలేజ్, టౌన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కబోయే ఈ చిత్రంలో దొంగలను దోచుకునే దొంగ పాత్రలో సప్తగిరి నటించనున్నారు. ఆగస్టు ప్రథమార్ధంలో సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments