జనవరి 7, 8 తేదీల్లో సప్తగిరి ఎక్స్ ప్రెస్ నైజాం టూర్

  • IndiaGlitz, [Friday,January 06 2017]

టాలీవుడ్ స్టార్ కమీడియన్ సప్తగిరి హీరో లాంఛింగ్ సినిమా సప్తగిరి ఎక్స్ ప్రెస్ బాక్సాఫీస్ పై కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన ప్రతి చోటా హౌస్ ఫుల్ వసూళ్ల రాబడుతోందని ఈ చిత్ర బృందం తెలిపింది. మాస్టర్స్ హోమియోపతి అధినేత డాక్టర్ రవికిరణ్ శ్రీ సాయి సెల్యులాయిడ్ క్రియేషన్స్ పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి వస్తోన్న ఆదరణ నేపథ్యంలో ఇటీవలే సప్తగిరి ఎక్స్ ప్రెస్ టీమ్ సక్సెస్ టూర్ ప్లాన్ చేశారు. అందులో భాగంగా మొదట శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఈ చిత్ర బృందం పర్యటించింది. వెళ్లిన ప్రతి చోటా సప్తగిరి ఎక్స్ ప్రెస్ బృందాన్ని అభిమానులు విశేషంగా ఆదరించారని నిర్మాత రవికిరణ్ తెలిపారు. ఆంధ్రా టూర్ కి కొనసాగింపుగా జనవరి 7,8 తేదీల్లో నైజాం ఏరియాలో సప్తగిరి ఎక్స్ ప్రెస్ టీమ్ పర్యటించనుందని నిర్మాత చెప్పారు.

సప్తగిరి ఎక్స్ ప్రెస్ నైజాం టూర్ షెడ్యూల్

జనవరి 7, 12pm - నల్గొండ

జనవరి 7, 3pm - ఖమ్మం

జనవరి 7, 7pm - వరంగల్

జనవరి 7, 10pm - కరీంనగర్

జనవరి 8, 12pm - నిజామాబాద్

జనవరి 8, 3pm - నిర్మల్

జనవరి 8, 7pm - ఆదిలాబాద్

ఇక ఇంతటి ఊహించని విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు ఈ చిత్ర హీరో సప్తగిరి. సినిమాటోగ్రాఫ్ రామ్ ప్రసాద్, ఎడిటర్ గౌతంరాజు ఈ సినిమాను తమ నైపుణ్యంతో ప్రేక్షకుల్ని ఆద్యంతం అలరించే విధంగా తీర్చి దిద్దారని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన అభిమానులు తమ చిత్ర బృందానికి ఎంతో సహాయపడ్డారని డైరెక్టర్ అరుణ్ చెప్పారు. ఇక ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్ : డాక్టర్ వాణి రవికరిణ్, సినిమాటోగ్రాఫర్ : సి.రామ్ ప్రసాద్, ఎడిటిర్ : గౌతంరాజు, క్రియేటివ్ హెడ్ : గోపాల్ అమిరశెట్టి, మాటలు : రాజశేఖర్ రెడ్డి పులిచర్ల.

More News

గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సెన్సార్ పూర్తి..!

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ న‌టించిన 100వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్ టైన్మెంట్ బ్యానర్ పై జాగ‌ర్ల‌మూడి క్రిష్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో బాల‌య్య స‌ర‌స‌న శ్రియ న‌టించింది.

ఖైదీ నెం 150 మేకింగ్ రిలీజ్..!

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ప్రెస్టేజీయ‌స్ మూవీ ఖైదీ నెం 150. మాస్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ఈ భారీ చిత్రాన్ని తెర‌కెక్కించారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రాన్నినిర్మించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్కో సాంగ్ ను రిలీజ్ చేసిన ఖైదీ నెం 150 టీమ్ ఈరోజు మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగా ఫ్రేమ్..!

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన 150వ చిత్రం ఖైదీ నెం 150. డైన‌మిక్ డైరెక్ట‌ర్ వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ ఈ ప్రెస్టేజీయ‌స్ మూవీని కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా ఈనెల 11న వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది.

ఆరోజు చైతు మ‌ర‌చిపోలేని రోజు..!

అక్కినేని నాగ‌చైత‌న్య జీవితంలో జ‌న‌వ‌రి 29 మ‌ర‌చిపోలేని రోజుగా మార‌బోతుంది అట‌. ఇంత‌కీ విశేషం ఏమిటి అనుకుంటున్నారా..?  ఒక‌టి కాదు రెండు విశేషాలు అంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది.

'కేశవ' నైజాం హక్కులు దక్కించుకున్న ఏషియన్ ఎంటర్ ప్రైజెస్ సునీల్..!

విభిన్న చిత్రాలు చేసే హీరోగా నిఖిల్ కు గుర్తింపు ఉంది.