వచ్చే నెలలో 'సంతోషం' సౌత్ ఇండియన్ 16వ ఫిల్మ్ అవార్డ్సు వేడుక
- IndiaGlitz, [Friday,July 07 2017]
సంతోషం ఇప్పుడు నవజవ్వనిగా టీనేజిలోకి ప్రవేశించింది. పదిహేనేళ్ల వయసంటే అందంగా అందరినీ అలరించడమే. పువ్వు పుట్టగానే పరిమళించనట్టు తన మొదటి పుట్టినరోజు పండగకే సూపర్ స్టార్లు.. నటసామ్రాట్టుల నుంచి ప్రశంసలతో పాటు ఆశీర్వచనాలను అందుకుంది. మొదటి పుట్టిన రోజుకే ఎందో ప్రముఖుల నుంచి ఎన్నో ప్రశంసలు, అభినందనలు అందుకోవడం సినిమా వార పత్రిక విషయంలో అరుదైన విషయం. కానీ సంతోషం వారం వారం సరికొత్త సొబుగలతో, సరికొత్త వార్తలతో కన్నులపండువజేసే ముఖ చిత్రాలతో, తనకే స్వంతమైన వార్తలతో వస్తుంటే ఎంతిటివారైనా ఎందుకు అభినందించరు? మొదటి పుట్టినరోజు పండుగ నాడు లభించిన ఆ పొగడ్తలతో, ఆశీస్సులతో ద్విగుణీకృత ఉత్సాహాంతో రెండో పండుగకు..మూడో పండుగకు వెళ్తూ ఏడాది ఏడాదికి తన పాఠక పరిధిని మరింత పెంచుకుంటూ ఇటు పాఠకులలో..అటు ఇండస్ర్టీ ఆత్మీయ అనురాగాలను మరింతగా ప్రొది చేసుకుంటూ మరింతగా వారి హృదయాలకు దగ్గరైంది. కేవలం 15 ఏళ్ల కాలంలో ఇంతగా ఇండస్ర్టీ హృదయాంతరాళలోకి అశేష ప్రేక్షకలోకం యొక్క మనస్సుల్లోకి చొచ్చుకుపోవడం ఒక్క సంతోషం వార పత్రికకు మాత్రమే దక్కింది.
అవును సురేష్ సంతోషం ! సురేష్ కొండేటి యొక్క కలల రూపం. మాస పత్రిక. తన కలల రూపాన్ని సంతోషంగా తీర్చిదిద్దడానికి నడుంకట్టే సమయానికి సురేష్ కొండేటి 30 ఏళ్లు నిండని నవయవ్వనుడు. కేవలం 29 ఏళ్ల వయసులోనే ఏ పత్రికాధినేత స్వంత పత్రికను స్థాపించిన దాఖలాలు లేవు! పత్రికను స్థాపించడం గొప్పకాదు. దానిని కంటికి రెప్పలా కాపాకుంటూ, ఎప్పటికప్పుడు తన మానస పత్రికను సరికొత్త హంగులను, సొగబులను అద్దుకుంటూ..ఏ ఒక్క వారం మిస్ కాకుండా.. ఏ ఒక్క వారమూ అనుకున్న రోజు (మంగళవారం)నే తీసుకురావడం అన్నది ఈ సినిమా వార పత్రిక ప్రపంచంలోనే ఒక్క సంతోషం సురేష్ కొండేటికు మాత్రమే దక్కింది. అందుకే ఆయన యొక్క పత్రిక ను మిత్రులంతా సురేష్ కొండేటి ది గ్రేట్ అంటారు.
అందుకే దీర్ఘాయుశ్మాన్ భవ అంటారు
ఒక పెళ్లి మూడు రోజులు చేయోచ్చు ఐదు రోజులు చేయోచ్చు ఒక బ్రహ్మండమైన ఇల్లు ఏడాదిలో కట్టొచ్చు.. ఐదేళ్లలోనూ కట్టొచ్చు. కానీ పత్రికను నడపండం అనేది రోజూ పోరాటమే. రోజూ వెదుకులాటలే. పత్రికను ఏదో తీసుకువస్తున్నాం? అన్నట్టుగా తీసుకురావొచ్చు.. లేదా అప్పటికప్పుడు కుంటి నడక నడుస్తూ తీసుకురావొచ్చు. కానీ సురేష్ కొండేటి తన పత్రికను వారం వారం..ఈ 15 ఏళ్ల కాలంలో ఏ ఒక్క వారమూ ఏ కారణం చేత కూడా ఈ వారం 'సంతోషం' రాలేదు అనిపించుకోకుండా ముచ్చటగొలిపే అందమైన అమ్మాయిలా పాఠకుల ముందుకు తీసుకువస్తున్నారు. అందుకే పరిశ్రమలో వారంతా సంతోషంను దీర్ఘాయుశ్మాన్ భవ అంటూ అశీర్వ దిస్తున్నారు. ఇలాంటి పత్రిక ఇండస్ర్టీకి కావాలంటారు. ఉండాలంటున్నారు. కారణం? సంతోషం ఇండస్ర్టీలో ప్రతీ ఒక్కరికి సంతోషాన్నిచ్చే పత్రిక. అందులో అసత్యాలకు నిందారోపణలకు ఏ మాత్రం అవకాశం లేకుండా దిగ్విజయంగా రన్ చేయడమే.
సంచలనం సృష్టిస్తున్న అవార్డు వేడుకలు:
ఎన్నో కష్టాలు పడి పత్రికను నిర్విరామంగా తీసుకురావొచ్చు గానీ .. కానీ 15 ఏళ్లు గా అవార్డు వేడుకను నిర్వహించడం అనేది అసామాన్య విషయం. అది పత్రికా ప్రపంచంలో ఒక్క సురేష్ కొండేటి కి మాత్రమే దక్కింది. మన దేశంలో జాతీయ సినిమా వార పత్రిక ఒక్క 'ఫిలిం ఫేర్' మాత్రమే ఏటేటా అవార్డు వేడుకను జరుపుతోంది. కానీ ఒక ప్రాంతీయ పత్రిక పదిహేనుళ్లుగా తన వార్షికోత్సవంతో పాటు అవార్డుల వేడుకను కూడా శోబాయానంగా జరపడం అనేది ఒక్క సురేష్ కొండేటికి మాత్రమే దక్కిన గ్రేట్ నెస్.
సురేష్ చేస్తున్న మరో ఘనమైన సంప్రదాయం..కేవలం తెలుగులోని ప్రతిభావంతులకు మాత్రమే కాకుండా సంతోషం సౌత్ ఇండియా ఫిలిం అవార్డులను కూడా ప్రారంభించారు. కొన్నేళ్లగా దక్షిణాది భాషల్లోని ప్రతిభా వంతులందరినీ హైదరాబాద్ కు రప్పించి అవార్డులిచ్చి తిరిగి సగౌరవంగా వారిని పంపుతున్నారు. ఇదెంతటి మహోన్నత కార్యక్రమమో, ఎంతటి క్లిష్టమైన కష్టమైన కార్యక్రమమో, ఎంతో శ్రమతో పాటు ఖర్చుతో కూడుకున్న వ్వవహారమో అందరికీ తెలిసిందే.
ఆయని ముఖంపై చెరగని చిరునవ్వు:
ఈ నిత్య శ్రమజీవి సురేష్ కొండేటికి ముఖ్యమైన ఆభరణం చిరునవ్వు. ఎంతటి క్లిష్టమైన పనిలోనూ, ఎంతటి కష్టమైన పనిలోనూ సురేష్ తన ముఖంలోని సహజమైన చిరునవ్వును చెరగనీయుడు. అదే అతని యొక్క విజయ రహస్యం.! లేకపోతే మన కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, మ న బాలయ్య, మన నాగార్జున, మన వెంకటేష్, మన మహేష్ బాబు, మన నట సామ్రా ట్ లు ఇలా అందరూ రావడం అటుంచితే ఎక్కడ కమల్ హాసన్, ఎక్కడ కె. బాలచందర్, జయమాలిని, జ్యోతిలక్ష్మి, దర్శకేంద్రుడు, దర్శకరత్నాలు, ఉత్తరాది-దక్షిణాది తారల సమూహంగా ఈ సంతోషం అవార్డు వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ప్రతి వేడుక విజయవంత కావడానికి సురేష్ కొండేటి అనే ఒకొనొక వ్యక్తి నిద్రాహారాలు మాని శ్రమిస్తాడు. తపిస్తాడు. దటీజ్ సురేష్..సురేష్ కొండేటి ద గ్రేట్.
నిజాయితీగా పనిచేయడం ఆయన నేర్చిన విద్య:
మన ఫిలిం ఇండస్ర్టీలో టాలెంట్ కంటే నిజాయితీ, నమ్మకాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇక్కడ ఏ వ్యక్తినైనా ఆ రెండే ముందుకు మునుముందుకు నడిపిస్తాయి. అందలాన్ని ఎక్కిస్తాయి. అందుకే ఇవాళ సురేష్ కొండేటి మన ఇండస్ర్టీలో మెగా పీఆర్ ఓగా, ఎఫ్ ఎన్ సీసీ కల్చరల్ కమిటీ చైర్మన్ గా, 'మా' అసోసియేషన్ కల్చరల్ కమిటీ చైర్మన్ గా, ఈసీ మెంబర్ గా, తెలంగాణ ప్రభుత్వ అవార్డు కమిటీలో సలహాదారుగా, ఫిలిం క్రిటిక్స్ సంఘం కల్చరల్ కమిటీ ప్రెసిడెంట్ గా బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. అంతేగాకుండా సురేష్ కొండేటి ప్రముఖ డిస్ర్టిబ్యూటర్ గానే కాకుండా ఎస్.కె పిక్చర్స్ బ్యానర్ పై పలు చిత్రాలను ఉత్తమ చిత్రాలను అందించి ఉత్తమాభిరుచి కలిగిన నిర్మాత కూడాను!
కాగా 16వ 'సంతోషం' సౌత్ ఇండియన్ ఫిలిం అవార్స్డు వేడుక వచ్చే నెల (ఆగస్టు) లో హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా తారల తళుకుల మధ్య నిర్వహించడానికి అవార్డు అధినేత సురేష్ కొండేటి ముహూర్తం కూడా పెట్టేసారు. మరి ఆ తేది ఏంటి? అన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే!