'సంతోషం' అవార్డుల కర్టైన్ రైజర్ ఫంక్షన్!
Send us your feedback to audioarticles@vaarta.com
'సంతోషం' అవార్డుల పండుగ షురూ అయింది. 16 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తిచేసుకుని 17వ ఏటలోకి అడుగు పెట్టేసింది. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్ లో అవార్డులకు సంబంధించిన కర్టైన్ రైజర్ ఫంక్షన్ గా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో పలువురు టాలీవుడ్ తారలు, తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో....
సంగీత దర్శకులు మాదవపెద్ది సురేష్ మాట్లాడుతూ, "నేను మ్యూజిక్ డైరెక్ట్ అయితే సురేష్ గారు పత్రికా రంగంలో చాలా మంచి పేరు సంపాదించారు. నాకు మంచి మిత్రుడు. ఎన్ని సినిమా పత్రికలు ఉన్నా సంతోషం ఎప్పుడూ నెంబర్ వన్ లో ఉంది. సురేష్ యంగ్ ఏజ్ లోనే పైకి వచ్చారు. సినిమా పెళ్లి కి కావాల్సింది ఆనందం. అది ఆయనకు పత్రికలో దొరికింది. అందుకే ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. అందరికీ కావాల్సిన వ్యక్తి ఆయన. తలలో నాలుకలాంటి వారు. ఈనెలలో నిర్వహించే సంతోషం అవార్డుల ఫంక్షన్ గ్రాంగ్ గా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా" అని అన్నారు.
నటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ, "సురేష్ తో 23 ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. నాకు తమ్ముడు లాంటోడు. అందరితో సరదాగా ఉంటారు. 'మా'కు బాగా సహకరిస్తున్నారు. ఆమెరికాలో జరిగిన ఓ ఈవెంట్ కు ఆయన ఎంతగానో సహకరించారు. 16 ఏళ్లగా సంతోషం అవార్డులను నిర్వహించడం అంటే చిన్న విషయం కాదు. చాలా ఫ్యాషన్ , శ్రమపడాలి. అవన్నీ సురేష్ లో ఉన్నాయి.
కాబట్టే సురేష్ దిగ్విజయంగా ఇన్నేళ్లగా అవార్డుల వేడుకను గ్రాండ్ గా చేయగల్గుతున్నారు. ఇతర సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డులకు దీటుగా 'సంతోషం' అవార్డులను అందజేస్తున్నారు. అటు నిర్మాతగానూ సక్సెస్ ఫుల్ గా ఉన్నారు. ఇంకా ఉన్నత స్థానాలకు చేరుకోవాలి. ఇలాంటి మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను" అన్నారు.
నటుడు బెనర్జీ మాట్లాడుతూ, "కొండేటి కన్నా సంతోషం ఇంటి పేరు అయిపోయింది. మనిషి ఎప్పుడు చిరునవ్వుతో ఉంటాడు. చాలా ఓపికగా తనకి ఏం కావాలో చిరు నవ్వుతో చేయించుకుంటాడు. మంచి వ్యక్తిత్వం గలవారు. అందుకే ఆయన పిలిచిన వేడుకకు సినిమా వాళ్లు అంతా సంతోషంగా హాజరవుతుంటారు. ఆయన `మా` లో కూడా కల్చరల్ చైర్మన్ గా కీలక బాధ్యతలు చేపడుతున్నారు. ఇప్పటికే ఆయన చాలా మంచి పనులు చేసారు. ఈ ఏడాది `సంతోషం` అవార్డుల వేడుక గ్రాండ్ గా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా"అని అన్నారు.
'సంతోషం' మ్యాగజైన్ అధినేత సురేష్ కొండేటి మాట్లాడుతూ, "ఆగస్టు 1వ తేదితో సంతోషం 16 సంవత్సరాలు పూర్త చేసుకుని 17 సంవత్సరంలోకి అడుగు పెట్టాం. ఇంత గ్రాండ్ గా చేయగల్గుతున్నాను అంటే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, నాగచైతన్య, శర్వాందన్, నితిన్, అఖిల్, ఇంకా యంగ్ హీరోలతో తో పాటు దర్శక, నిర్మాతలు అందరి సహకారం ఉంది కాబట్టే ఇవన్నీ చేయగల్గుతున్నాను. సాధించగలిగాను.
నేను పాత్రికేయుడిగానే కెరీర్ ప్రారంభించాను. వాళ్లంతా ఎప్పుడూ వెన్నెంటే ఉన్నారు. వాళ్లు కూడా నా సక్సెస్ లో కీలక పాత్ర పోషించారు. సంతోషం అవార్డుల వేడుక ప్రతీ సంవత్సరం ఆగస్టులో నిర్వహిస్తున్నాం. కర్టైన్ రైజర్ వేడుక ఆగస్టు 2 వ తేదీన ఓ సెంటిమెంట్ గా చేస్తాం. అతి త్వరలోనే వేడుకల పండుగ ను ఇదే నెలలో గ్రాండ్ గా జరుగుతుంది. టాలీవుడ్ అంతా వచ్చి మా అవార్డుల వేడుకను సక్సెస్ చేస్తారని కోకుంటున్నా" అని అన్నారు.
హీరోయిన్ నిత్యా శెట్టి మాట్లాడుతూ, "దేవుళ్లు సినిమా నుంచి సురేష్ గారు తెలుసు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఆయన అలాగే ఉన్నారు. అంతా 'సంతోషం' వలనేమో. ఈ ఏడాది నిర్వహించే అవార్డుల వేడుక ప్రతీ ఏడాదిలానే సక్సెస్ కావాలని, ఇలాంటి వేడుకలు మరిన్నిచేయాలని కోరుకుంటున్నా" అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments