సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న 'ప్రేమ్ కుమార్' గ్లింప్స్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
సంతోష్ శోభన్ హీరోగా సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై.లి. శివప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్న చిత్రం 'ప్రేమ్ కుమార్'. రాశీ సింగ్ హీరోయిన్. ఈ చిత్రంతో అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కృష్ణచైతన్య, రుచిత సాధినేని, కృష్ణతేజ, సుదర్శన్, అశోక్ కుమార్, ప్రభావతి, రాజ్ మాదిరాజు, అశోక్ కుమార్, మధు, అభిషేక్ మహర్షి, శ్రీవిద్య, సాయి శ్వేత, ఆకుల శివ ఇతర తారాగణం. బుధవారం సినిమా గ్లింప్స్ విడుదల చేశారు.
గ్లింప్స్ చూస్తే... సునందగారికి సింగిల్ సుపుత్రుడు, సుందర లింగానికి సోలో స్నేహితుడు, రోషన్ గాడికి రంకు మొగుడు, వరుడు చిరంజీవి చిం ప్రేమ్ కుమార్ అంటూ హీరోతో పాటు అతడి జీవితంలో కీలక పాత్రధారులను పరిచయం చేశారు. వధువుగా రాశీ సింగ్ ను సైతం చూపించారు. అయితే, పెళ్లి ఎందుకు ఆగిందనేది సస్పెన్స్ లో ఉంచారు. పెళ్లి కూతురు పీటలు ఎక్కకుండా ఎందుకు లేచిపోయింది అనేది చెప్పకుండా సినిమాపై ఆసక్తి పెంచారు.
దర్శకుడు అభిషేక్ మహర్షి మాట్లాడుతూ "ప్రేమ్ కుమార్ పెళ్లి ఆగింది సరే. అసలు ఎందుకు, ఎవరి వల్ల, ఎవరితో, ఎలా ఆగింది? అసలు పీకే కి పెళ్లి అవుతుందా? లేక అలానే ఉండిపోయి పెళ్లి చూపులతో సరిపెట్టుకుంటాడా? ఇంతకీ, పెళ్లి ఎప్పుడు? రానున్న రోజుల్లో ఇలాంటి వాటికి సమాధానం దొరుకుతుంది. అప్పటివరకు మా తొలి శుభలేఖ ఇదే" అని అన్నారు.
నిర్మాత శివప్రసాద్ పన్నీరు మాట్లాడుతూ "హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా ఇది. మా దర్శకుడు అభిషేక్ మహర్షి, రచయిత అనిరుధ్ కృష్ణమూర్తి కలిసి చక్కటి ఓ సరికొత్త కథ రాశారు. కథనం ఆసక్తి కలిగిస్తూ, నవ్విస్తుంది. సంతోష్ శోభన్ పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తాం" అని అన్నారు.
సంతోష్ శోభన్, రాశీ సింగ్, కృష్ణచైతన్య, రుచిత సాధినేని, కృష్ణతేజ, సుదర్శన్, అశోక్ కుమార్, ప్రభావతి, రాజ్ మాదిరాజు, అశోక్ కుమార్, మధు, అభిషేక్ మహర్షి, శ్రీవిద్య, సాయి శ్వేత, ఆకుల శివ నటిస్తున్న ఈ చిత్రానికి పీఆర్వో: సురేంద్రకుమార్ నాయుడు - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), డిజిటల్ మీడియా: టికెట్ ఫ్యాక్టరీ, ఎడిటర్: గ్యారీ బీహెచ్, సినిమాటోగ్రఫీ: రాంపీ నందిగాం, రచన: అభిషేక్ మహర్షి, అనిరుధ్ కృష్ణమూర్తి, అడిషనల్ డైలాగ్స్: చరణ్ తేజ్, పాటలు: కిట్టు విస్సాప్రగడ, సంగీతం: అనంత్ శ్రీకర్, నిర్మాణ సంస్థ: సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై.లి, నిర్మాత: శివప్రసాద్ పన్నీరు, దర్శకత్వం: అభిషేక్ మహర్షి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments