Santhosh Shoban:'ప్రేమ్ కుమార్' ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో రానటువంటి పాయింట్‌తో రూపొందిన సినిమా - హీరో సంతోష్ శోభన్
Send us your feedback to audioarticles@vaarta.com
సంతోష్ శోభన్ హీరోగా, రాశీ సింగ్, రుచిత సాధినేని హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘ప్రేమ్ కుమార్’. సారంగ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శివ ప్రసాద్ పన్నీరు ఈ సినిమాను నిర్మించారు. రైటర్ అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. లవ్ అండ్ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 18న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హీరో సంతోష్ శోభన్ మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా మాట్లాడారు..
‘ప్రేమ్ కుమార్’ కథేంటి?
చాలా కాలం, చాలా తెలుగు సినిమాల్లో కళ్యాణ మండపం మీద క్లైమాక్స్ ఉండే సినిమాలు కొన్ని ఉన్నాయి. అక్కడకు హీరో వచ్చి హీరోయిన్‌కి, ఆమె ఫాదర్‌కి కలిపి ఏవో నాలుగు నీతులు చెప్పి హీరోయిన్‌తో వెళ్లిపోతాడు. కానీ.. అక్కడొకడు మిగిలిపోతాడు. వాడు పరిస్థితేంటో తెలీదు.. ఎంత మందికి కార్డులిచ్చాడో.. ఎన్ని అప్పులు చేశాడో..బట్టలు ఎలా కొనుకున్నాడో?.. అనే విషయాలను ఎవరూ పట్టించుకోరు. అలాంటి వాడిపై దర్శకుడు అభిషేక్ చేసిన సినిమానే ‘ప్రేమ్ కుమార్’. వందేళ్ల ఇండియన్ సినిమాల్లో ఎన్నో క్యారెక్టర్స్, ఎన్నో సినిమాలు వచ్చాయి. ఓ ఆర్టిస్ట్ లైఫ్‌లో ఇప్పటి వరకు చెప్పని కథో, ఎవరు చేయని పాత్రను ఎలివేట్ చేయటం అనేది పూర్తిగా కొత్తగా ఉంటుంది. ఉదాహరణకు ఏక్ మినీ కథ పాయింట్ అనేది తెలుగు సినిమాలో చెప్పటం నాకు తెలిసి ఫస్ట్ టైమ్. అలా మండపంపై మిగిలిపోయే వాడి కథ ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదు. అలాంటి వ్యక్తికి కూడా ఓ ఎమోషన్ ఉంటుంది. దాన్ని డైరెక్టర్ అభిషేక్ చక్కగా రాసుకున్నాడు. అది కూడా ఎంటర్ టైనింగ్ వేలో.
‘ప్రేమ్ కుమార్’మూవీ చేయటానికి ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా?
‘ప్రేమ్ కుమార్’ కథకు అసలైన ఇన్స్పిరేషన్ ఏంటో నాకు తెలియదు. కానీ డైరెక్టర్ అభిషేక్ తనకు తెలిసిన కొందరు వ్యక్తులు అలాంటి సిట్యువేషన్స్‌ను ఫేస్ చేశారనైతే చెప్పారు. ఇక ‘ప్రేమ్ కుమార్’ టైటిల్ ఎందుకు పెట్టామంటే రాశి ప్రొడక్షన్స్ సూరజ్ భర్జత్యాగారి సినిమాల్లో హీరో పేరు ప్రేమ్ అని ఉంటుంది. టైటిల్ ఆలోచన మాత్రం అక్కడి నుంచి వచ్చిందే. ప్రేమ్ కుమార్ అనే యువకుడు అతి తెలివి. అది వాడికి పనికి రాదు. దురదృష్టవంతుడు. ఏది స్టార్ట్ చేసినా వర్కవుట్ కాదు. చివరకు అనే రిస్కులు చేసి పెళ్లి చేసుకుంటాడు.
అభిషేక్లోని దర్శకుడిని ఎలా గుర్తించారు?
అభిషేక్ కొన్ని సినిమాల్లో నటుడిగా కూడా చేశాడు. తర్వాత దర్శకుడు కావాలని అనుకున్నప్పుడు ‘ప్రేమ్ కుమార్’ కథను తయారు చేసుకున్నాడు. డైరెక్టర్‌గా ముందు తను నన్ను నమ్మాడు. క్యారెక్టర్ సూట్ అవుతుందని ఆలోచించి చేయలేదు. వినగానే నచ్చింది. అంతే కాకుండా కామెడీ అంటే చాలా ఇష్టం. అభిషేక్ రాసుకున్న విధానం బాగా నచ్చింది. రియాలిటీగా తను రాసుకున్న డైలాగ్స్ నచ్చాయి.
పెళ్లిపైన సినిమాలు చేస్తుంటే మీ పెళ్లి గురించి ఇంట్లో అడగటం లేదా?
లేదండి.. నెక్ట్స్ సినిమా ఎప్పుడు అని ఇంట్లో వాళ్లు అడుగుతున్నారు. ఇప్పటికైతే ఆ ఆలోచన అస్సలు లేదు. పెళ్లి బట్టలు చూస్తుంటే డిప్రెషన్ వచ్చేస్తుంది .. పెళ్లి తతంగం వద్దనిపిస్తుంది. చేసుకుంటే రిజిష్టర్ మ్యారేజ్ చేసుకుంటాను (నవ్వుతూ)..
ఇప్పటి వరకు రైట్ థియేట్రికల్ సక్సెస్ రాలెందుకు ?
నేను ఇప్పటి వరకు చాలా మంచి డైరెక్టర్స్‌తో కలిసి పని చేశాను. ఎంజాయ్ చేశాను. నేను చేసిన సినిమాలన్నీ కరెక్ట్‌గానే ఎంచుకున్నానా? అంటే లేదనే అంటాను. అయితే ఇంతకు ముందు చెప్పినట్లు నందినీగారు, గాంధీగారు, మారుతిగారు వంటి డైరెక్టర్స్‌తో వర్క్ చేయటం హ్యాపీగా అనిపించింది. అయితే ‘ప్రేమ్ కుమార్’ ఆ కొరతను తీరుస్తుందని అనుకుంటున్నాను. ఇందులో నా బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ అన్నీ కొత్తగా ఉంటాయి. నేను, అభిషేక్, శివ ... సినిమా స్టార్ట్ చేయటానికి ముందే మంచి ఫ్రెండ్స్. జంధ్యాలగారు, వంశీగారు, ఇవివిగారు.. స్టైల్లో ఆకట్టుకుంటుందనుకుంటున్నాను.
నెక్ట్స్ మూవీస్..?
యువీ క్రియేషన్స్‌లో ఓ సినిమా చేయబోతున్నాను. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్లో సినిమా ఉంటుంది. వాటి వివరాలను త్వరలోనే తెలియజేస్తాను.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com