నయన్ కి పోటీగా సంతానం
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డిని, నటసింహం బాలకృష్ణ 102వ చిత్రంని ఒకే టైంలో ఒప్పుకుని మరోసారి వార్తల్లో నిలిచింది కేరళకుట్టి నయనతార. వీటిలో బాలయ్యతో చేస్తున్న చిత్రం సంక్రాంతికి రానుంది. ఇదిలా ఉంటే.. ఈ నెలలో నయనతార నటించిన ఓ తమిళ చిత్రం విడుదలకు సిద్ధమైంది. అరమ్ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో కలెక్టర్ పాత్రలో దర్శనమివ్వనుంది నయన్.
హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కిన అరమ్ ఈ నెల 29న విడుదలకు సిద్ధమవ్వగా.. ఆ సినిమాకి పోటీగా కమెడీయన్ సంతానం నటించిన కొత్త చిత్రం సర్వర్ సుందరం కూడా రిలీజ్ కాబోతుంది. కమెడీయన్‌తో పోటీకి దిగిన నయనతారకి ఎలాంటి రిజల్ట్ లభిస్తుందో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments