బిజినెస్ మ్యాన్ @ 9.. మిరపకాయ్ @ 10...
Send us your feedback to audioarticles@vaarta.com
కొన్ని సినిమాలను ఎన్ని ఏళ్లయినా మరచిపోలేం.. ఆ కోవకు చెందినవే.. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘బిజినెస్ మ్యాన్’.. మాస్ మహరాజ్ రవితేజ నటించిన ‘మిరపకాయ్’ సినిమాలు. ఇదే రోజున సంక్రాంతి కానుకగా ఈ సినిమాలు విడుదలయ్యాయి. అద్భుతమైన విజయం సాధించాయి. ‘బిజినెస్ మ్యాన్’లో సూర్యాభాయ్‌గా మహేష్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. మాస్, క్లాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. కాజల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ముంబై కేంద్రంగా నడిచే ఈ కథకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు.
అలాగే మాస్ మహరాజ్ రవితేజ నటించిన మిరపకాయ్ సినిమా విడుదలై సోమవారానికి పదేళ్లు. అంటే జనవరి 12, 2011లో ఈ సినిమా విడుదలైంది. రిచా గంగోపాధ్యాయ, దీక్షాసేథ్, ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రను పోషించారు. గ్యాంగ్‌స్టర్‌ని పట్టుకోవడం కోసం పోలీస్ ఆఫీసర్ అయిన రవితేజ టీచర్‌గా మారిపోతాడు. ఆ తరువాత గ్యాంగ్‌స్టర్‌ని పట్టుకోవడం వంటి అంశాలతో ఈసినిమా రూపొందింది. ఈ సినిమాలో కామెడీ కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమా కూడా క్లాస్, మాస్ అన్న భేదం లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను రాబట్టింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments