ఉసూరుమనిపించిన జగన్.. రాజధాని రైతులూ వాట్ నెక్స్ట్!

నవ్యాంధ్ర మూడు రాజధానుల వ్యవహారమై శుక్రవారం నాడు ఏపీ కెబినెట్ సమావేశం జరిగింది. సుమారు రెండున్నర గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో దీనిపై నిశితంగా చర్చించి ఓ ఫైనల్‌ నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే జీఎన్ రావు కమిటీ ప్రభుత్వానికి అందగా.. మరో బీసీజీ నివేదిక రావాల్సి ఉండటం.. ఆ తర్వాత మళ్లీ దీనిపై మళ్లీ హైపవర్‌ కమిటీ ఉంటుందని ఫైనల్‌గా రాజధాని ప్రకటన ఉంటుందని తేలిపోయింది. వాస్తవానికి ఇవాళ తాడో పేడో సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తేల్చేస్తారని అటు రాయలసీమ.. ఇటు ఉత్తరాంధ్ర మరీ ముఖ్యంగా రాజధాని వాసులు, రైతులు భావించారు. అయితే.. రాజధానిపై ప్రకటన లేకపోయే..? కనీసం రాజధానిపై క్లారిటీ లేకుండా పోయే..? డిసెంబర్-19 నుంచి ఇవాళ్టి రోజులో కేబినెట్ ఏం నిర్ణయిస్తుందో అని ప్రజలందరూ వేయి కళ్లతో వేచి చూశారు. తీరా చూస్తే ఊరించి ఊరించి ఉసూరుమనిపించారు.

రైతులూ.. వాట్ నెక్స్ట్!?
అయితే జగన్ ప్రకటన వెలువడకపోవడంతో రాజధాని రైతులు ఇలాగే ఆందోళన కొనసాగిస్తారా..? లేకుంటే మిన్నకుండిపోతారా..? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు రాజధాని రైతులకు ఎలాంటి అన్యాయం జరగనివ్వమని కచ్చితంగా న్యాయం చేసి తీరుతామని మంత్రులు కుండ బద్ధలు కొట్టి మరీ చెబుతున్నారు. అయినప్పటికీ రైతుల్లో మాత్రం అపోహలు, అనుమానాలు మాత్రం తొలగట్లేదు. రాజధాని రైతుల్లో ఎంత మంది నిజంగా భూములిచ్చినవ వారు ధర్నాలు చేస్తున్నారు.? ఎంత మంది టీడీపీ చెప్పినట్లు ఆడుతున్నారు..? అనేది ఇప్పటికీ తెలియని వ్యవహారం. ఈ ర్యాలీలు, ధర్నాలు ఇంకా ఎన్నిరోజులిలా..? ప్రభుత్వం హామీ ఇస్తున్నప్పటికీ ఎందుకిలా..? అదేదో సామెత ఉంది కదా.. ఆలూ లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్లుగా.. రాజధానిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.. అసలు ప్రకటన ఉంటుందో లేదో కూడా తెలియట్లేదు.. రైతులు మాత్రం రోడ్లెక్కేశారని వైసీపీ కార్యకర్తలు, వీరాభిమానులు సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తుతున్నారు. మరోవైపు.. టీడీపీనే దగ్గరుండి మరీ ఇలాంటి డ్రామాలు ఆడిస్తున్నారని కూడా రైతులపై ఆరోపణలు వస్తున్నాయి. మరి ఈ ర్యాలీలు ఇంకెన్నాళ్లుంటాయో.

మీడియాపైనే దాడి!?
శుక్రవారం నాడు కేబినెట్ భేటీకి ముందు కొందరు మీడియా మిత్రులు రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అని సంబోధించడం.. వారికి వ్యతిరేకంగా కొన్ని కొన్ని చానెల్స్‌లో వార్తలు ప్రసారమవ్వడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం విలేకరులపై దాడికి పాల్పడ్డారు. ముగ్గురు జర్నలిస్టులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిప్పుడు ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారు. అయితే.. రైతుల ముసుగులో టీడీపీ కార్యకర్తలు, వీరాభిమానులే ఇలా దాడికి తెగబడ్డారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇలాగే అందరిపైనా దాడులు చేసుకుంటూ పోతే పరిస్థితేంటి..? ఇంత జరుగుతున్నా పోలీసులు ఏం చేస్తున్నట్లు..? అనే ప్రశ్నలకు మాత్రం జవాబు దొరకదు.

సంక్రాంతి వరకూ ఇలానే ఉంటుందా!?
రాజధానిపై జనవరి 3న బీసీజీ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. అనంతరం నివేదికపై నిశితంగా అధ్యయనం చేసిన తర్వాత రాజధానిపై ఫైనల్ నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ క్రమంలో సంక్రాంతి లోపు రాజధానిపై ప్రకటన ఉంటుందని స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాదు.. ప్రకటన వెలువరించే ముందు.. అఖిల పక్ష సమావేశంతో పాటు అసెంబ్లీ సమావేశాలు కూడా జరిపుతారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి ఆ ప్రకటన వచ్చేంత వరకూ రైతులు ఇలాగే ఆందోళన కొనసాగిస్తారా..? లేకుంటే సైలెంట్ అయిపోయి ప్రకటన అనంతరం ప్రభుత్వాన్ని నిలదీస్తారా అనేది తెలియాల్సి ఉంది.

సంక్రాంతి టెన్షన్!
వాస్తవానికి ప్రభుత్వం వన్స్ డిసైడ్ అయితే అది ఎన్ని అడ్డంకులు ఎదురైనా చేసి తీరుతుందంతే. ఈ విషయం ప్రజావేదిక కూల్చివేత వ్యవహారంలో స్పష్టమైంది. ఒక వేళ రాజధాని తరలించినా కొన్ని రోజులు హడావుడి జరిగి ఆ తర్వాత పరిస్థితులు అన్నీ సద్దుమణుగుతాయని విశ్లేషకులు, క్రిటిక్స్ చెబుతున్నారు. మొత్తానికి చూస్తే ఇప్పటి వరకూ డిసెంబర్ 27న ఏం జరుగుతుందో ఏమె అని టెన్షన్ పడిన రైతన్నలు.. ఇక సంక్రాంతి వరకూ టెన్షన్ టెన్షనే.! మరి ఫైనల్‌గా పరిస్థితి ఎలా ఉంటుందో..? ప్రకటన ఎలా ఉంటుందో తెలియాలంటే సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే.

More News

నిర్మాణ రంగంలోకి తార‌క్‌...?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నాడా? అంటే అవున‌నే స‌మాధానం సినీ వ‌ర్గాల్లో విన‌ప‌డుతుంది.

బ‌యోపిక్‌లో ప‌వ‌న్‌..  ఏది నిజ‌మప్పా?

ప‌వ‌ర్‌స్టార్, జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌చ్చే ఏడాది 2020లో సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నార‌నే సంగ‌తి తెలిసిందే.

ఎస్‌బీఐ యూజర్స్‌కు గుడ్ న్యూస్.. ఇక మోసాలకు చెక్!

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దాన్ని పనికొచ్చే పనులకంటే.. చిల్లర పనులకు పాల్పడుతూ మోసాలకు తెగ పాల్పడుతున్నారు.

ఆ విష‌యంలో ర‌ష్మిక కంటే త‌మ‌న్నానే బెట‌రా!

ప్ర‌తి టైమ్‌లో స్టార్ హీరోయిన్స్ మ‌ధ్య కోల్డ్ వార్ సినిమాల రూపంలో జ‌రుగుతూనే ఉంటుంది. తాజాగా ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ స‌మంత‌, కీర్తిసురేష్‌, త‌మ‌న్నా,

డ‌బ్బింగ్ పూర్తి చేసిన మ‌హేశ్‌

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా న‌టిస్తోన్న 26వ చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు`.  దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో