సంక్రాంతి సంద‌డి వీరిదేనా?

  • IndiaGlitz, [Sunday,June 03 2018]

2019 సంక్రాంతి ర‌స‌వ‌త్త‌రంగా ఉండ‌నుందా? అవుననే వినిపిస్తోంది ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాల‌లో. వినిపిస్తున్న క‌థ‌నాల ప్రకారం.. వచ్చే సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు విడుదల కానున్నట్టు తెలుస్తోంది. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అలాగే.. గత రెండేళ్లుగా సంక్రాంతి హీరో అనిపించుకున్న బాలకృష్ణ కూడా ఈ సారి ఎన్టీఆర్ బయోపిక్ ‘యన్.టి.ఆర్’తో హ్యాట్రిక్ కొట్టడానికి ఉవ్విళ్లూరుతున్నారు.

ఈ సినిమా జనవరి 12న రిలీజ్ కానుందని టాక్. మరోవైపు విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్ 2 – ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ కూడా జనవరి 14న పండుగ కానుకగా విడుదల కానుందని సమాచారం. అయితే.. వీటిలో చరణ్, బోయపాటి సినిమా మాత్రం పక్కాగా సంక్రాంతికి రానుండగా.. మిగిలిన రెండు సినిమాలు ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. చివరి నిమిషంలో డేట్స్ మరే అవకాశం ఉండొచ్చు కూడా. ఏది ఏమైనా ఇప్పటినుంచే ఈ అగ్ర హీరోలు పండుగ సీజన్లో సందడి చేయడానికి సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది.