వి.బి.రాజేంద్రప్రసాద్ కు పూజా సంకీర్తనలు అంకితం
Send us your feedback to audioarticles@vaarta.com
పూజా సంకీర్తనల పేరిట ఇప్పటికే నాలుగు ఆల్బంలను విడుదల చేశారు. ప్రముఖ నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ ప్రధమ వర్ధంతి సందర్భంగా భక్తి పాటలకు సంబంధించిన ఈ పూజా సంకీర్తనల ఐదవ ఆల్బంను అంకితం చేశారు. నటుడు మురళీమోహన్ ఈ సంకీర్తనల ఆల్బం ను విడుదల చేసి జగపతి బాబు కి అందించారు. ఈ సందర్భంగా..
మురళీమోహన్ మాట్లాడుతూ.. ''జగపతి సంస్థ ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలను నిర్మించింది. ముఖ్యంగా ఆ సంస్థ నుండి వచ్చే ప్రతి సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచేది. రాజేంద్ర ప్రసాద్ గారు సంగీత దర్శకులతో, పాటల రచయితలతో ప్రత్యేకంగా కొంత సమయం ఉండేవారు. సంగీతమంటే ఆయనకు ఎంతో అభిమానం ఉంది. అలాంటి కుటుంబం నుండి పూజా సింగర్ గా ఎదగడం చాలా ఆనందంగా ఉంది. నా మనువరాలు పూజా చక్కగా పాడుతుందని చెప్పి రాజేంద్రప్రసాద్ గారు చాలా గర్వంగా ఫీల్ అయ్యేవారు. పూజా సంకీర్తనలు నాలుగు ఆల్బంలను ఆయనే దగ్గరుండి రిలీజ్ చేశారు. ఈ డివోషనల్ సాంగ్స్ లో హిందీ, గుజరాతి బజన్స్ కుడా ఉన్నాయి. కేవలం భక్తి పాటలకే తన పూజా తన గొంతునిస్తుంది. ఈ ఆల్బం ను పూజా తన తాతగారికి అంకితం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది'' అని చెప్పారు.
మ్యూజిక్ డైరెక్టర్ బంటి మాట్లాడుతూ.. ''రాజేంద్రప్రసాద్ గారు ఎంతో ఎఫక్షనేట్ గా ఉండేవారు. పూజా ప్రతి పాటా చాలా బాగా పాడింది. మంచి మెలోడియస్ వాయిస్ తనది'' అని చెప్పారు.
జగపతిబాబు మాట్లాడుతూ.. ''నాన్నగారు బ్రతికున్నంత వరకు దసరా బుల్లోడు లా బ్రతికారు. చాలా ఎంజాయ్ చేసేవారు. పూజా చనిపోయిన వాళ్ళ తాతగారికి మంచి గిఫ్ట్ ఇచ్చింది. తను మల్టీ టాలెంటెడ్ పెర్సన్. బంటీ అండ్ టీం ఎక్సలెంట్ జాబ్ చేశారు. నాగేశ్వరావు గారు, నాయుడు గారు, నాన్నగారు అందరూ పైనే ఉన్నారు. నాకు తెలిసి వారంతా అక్కడ స్వర్గం అనే సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు ఉన్నారు'' అని చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments