సంజన గుట్టు విప్పింది
Thursday, July 20, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
దండుపాళ్యం 2లో సంజన వివస్త్రగా నటించిందనే వార్తలు, కొన్ని ఫోటోలు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో కనిపిస్తున్నాయి. అవేమీ తనకు సంబంధించినవి కావని చెప్పింది సంజన. దండుపాళ్యం 2 శుక్రవారం విడుదల కానుంది. ఈ సినిమాలోనే సంజన న్యూడ్‌గా నటించినట్టు వార్తలొచ్చాయి. వాటి గురించి ఆమె మాట్లాడుతూ ``సినిమా కథ చెప్పేటప్పుడే నాకు దర్శకుడు ఈ సన్నివేశాలను గురించి చెప్పారు.
అయితే వాటిలో నేను చేయాల్సిన అవసరం లేదని, డూప్‌తో చేయించుకుంటానని వారు తెలిపారు. ఆ ప్రకారమే చేసినట్టున్నారు. అయితే ఆ సన్నివేశాలను కూడా తొలగించారని తెలిసింది. కేవలం దర్శక,నిర్మాతల మధ్య రహస్యంగా ఉన్న ఈ దృశ్యాలు ఎలా లీకయ్యాయో కూడా అర్థం కావడం లేదు. అయినా వాటిలో ఉన్నది నేను కాదు. ఈ విషయాన్ని సైట్లలో చూసి చాలా బాధ కలిగింది`` అని వివరించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments