ఎవెంజ‌ర్స్ ని గుర్తుచేసే 'సంజీవిని' టీజ‌ర్ విడుద‌ల‌

  • IndiaGlitz, [Friday,May 11 2018]

గాల్లో ఎగిరే బ‌ల్లులు, తెలివైన కోతులు, ప‌ది అడుగుల సాలె పురుగులు ఇవన్నీ వెండితెర‌పై క‌నిపించి మ‌న‌ల్ని వాటి న‌ట‌న‌తో , యాక్ష‌న్ తో అబ్బుర‌ప‌రిచాయంటే అది త‌ప్ప‌కుండా హాలీవుడ్ చిత్ర‌మే అయి ఉంటుంది అని చెప్పొచ్చు, కాని ఈ సారి ఒక తెలుగు సినిమాలో వీటన్నిటినీ చూడ‌బోతున్నాం.. ఇవన్నీ తెలుగులోన‌టించాయి.

స‌మ్మ‌ర్ లో సినిమాల‌కి వ‌చ్చే ప్రేక్ష‌కుల్లో పిల్ల‌లు, ఫ్యామిలీ ఆడియ‌న్స్ సంఖ్య ఎక్కువుగా వుంటుంది. వీరిని దృష్టిలో పెట్టుకుని జి.నివాస్ ప్రోడ్యూస‌ర్ గా, ర‌వి వీడే ద‌ర్శ‌కుడి గా మ‌నోజ్ చంద్ర‌, అనురాగ్ దేవ్‌, శ్వేత ప్ర‌ధాన పాత్ర‌ల్లో అనేక‌మంది హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ దాదాపు రెండు సంవత్సరాల పాటు పని చేసి, మొట్టమొదటిసారిగా మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాలజీని సమ‌ర్థ‌వంతంగా వాడి,దాదాపు 1000 కి పైగా వి.ఎఫ్‌.ఎక్స్ షాట్స్ తో అత్యంత భారీగా నివాస్ క్రియేషన్స్ బ్యాన‌ర్ లో నిర్మించిన చిత్రం సంజీవని.. ప్ర‌స్తుతం ఫైన‌ల్ మిక్సింగ్ లో వుంది. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ సంస్థ శ్రీ ల‌క్ష్మిపిక్చ‌ర్స్ ద్వారా ప్ర‌పంచ వ్యాప్తంగా మే నెలాఖ‌రున విడుద‌ల కి స‌న్నాహలు చేస్తున్నారు. ఈరోజు ఈ చిత్రానికి సంభందించిన టీజ‌ర్ ని విడుద‌ల చేశారు.

ఈ సందర్భంగా ద‌ర్శ‌కుడు ర‌వి వీడే మాట్లాడుతూ.. ప్ర‌పంచంలో రామాయణం బేస్ చేసుకుని ఎన్ని క‌థ‌లు వ‌చ్చినా కూడా సుంద‌ర‌కాండ ప‌ర్వం అనేది మ‌న సినీ ప‌రిశ్ర‌మ‌కి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్క సుంద‌ర‌కాండ లోనే తెలివైన కోతులు,గాల్లో ఎగిరే రకరకాల జంతువులు, అబ్బుర‌ప‌రిచే యుద్ధాలు వుంటాయి. 6 సంవత్సరాల పిల్ల‌ల నుండి60 సంవత్సరాల పెద్ద‌వాళ్ళ వ‌ర‌కూ ఆనందంతో ఉప్పొంగిపోయే స‌న్నివేశాలుంటాయి.

అలాంటివి ఇప్ప‌టి వ‌ర‌కూ హాలీవుడ్ తెర‌పై మాత్ర‌మే క‌నిపించాయి. మొట్టమొదటిసారిగా భార‌త‌దేశంలో హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ తో క‌లిసి రెండు సంవ‌త్స‌రాలు,తెలుగులో మెష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాలజీని వాడి, దాదాపు1000 కి పైగా VFX షాట్స్ తో, ఇండియాలోనేకాకుండా కెన‌డా, ఆఫ్రికా, నేపాల్ దేశాల్లో అత్యద్భుతమైన లొకేషన్స్ లో అత్యంత క‌ష్ట‌త‌ర‌మైనా ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా హాలీవుడ్ పిక్చ‌ర్ అనేరేంజి లో భారీ గ్రాఫిక్స్ తో నిర్మించిన చిత్రం మా సంజీవని.  ఈ చిత్రం యెక్క టీజ‌ర్ ని విడుద‌ల చేశాము. టీజ‌ర్ చూసిన వారంతా ఇంత క్వాలిటి గ్రాఫిక్స్ ని ఇండియ‌న్ ఫిల్మ్స్ లో చూడ‌లేద‌ని ప్ర‌శంశిస్తున్నారు. మా సినిమా కి వ‌చ్చిన ప్రేక్ష‌కుడు మ‌రో లోకంలో విహ‌రిస్తాడ‌నేది మేము గ్యారంటిగా చెప్ప‌గ‌ల‌ను.

ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని విడుద‌ల‌కి సిద్దంగా వుంది.  మే నెలాఖ‌రున 2018 లో వ‌స్తున్న మొట్టమొదటి భారీ గ్రాఫిక్స్ చిత్రం గా చిన్న పిల్లల్ని,ఫ్యామిలీ ఆడియన్స్ ని అల‌రించే చిత్రం గా మా సంజీవని మొదటి స్థానంలో వుండ‌బోతుంది. మ‌నోజ్ చంద్ర‌, అనురాగ్ దేవ్‌, శ్వేత లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించ‌గా శ్ర‌వ‌ణ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

మా చిత్రాన్ని ప్ర‌ముఖ సంస్థ శ్రీ ల‌క్ష్మి పిక్చ‌ర్స్ వారు ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. ఈ స‌మ్మ‌ర్ లో వ‌చ్చే ప్రేక్ష‌కుల‌కి అబ్బుర‌ప‌రిచే విన్యాసాల‌తో.. ఆశ్చర్యపోయే వింత‌ల‌తో.. అత్యంత ఉత్సుక‌త‌తో.. ఊహించ‌ని ఉత్సాహంతో మనసారా ఆస్వాదించే చిత్రంగా సంజీవని నిల‌బ‌డుతుంద‌ని మా న‌మ్మ‌కం.. అనిఅన్నారు

ల‌క్ష్మిపిక్చ‌ర్స్ అధినేత బాపిరాజు గారు మాట్లాడుతూ.. ఈ స‌మ్మ‌ర్ లో ఎవెంజ‌ర్స్ ఎంత పెద్ద విజ‌యం సాధించిందో అంద‌రికి తెలిసిందే.. ఆ రేంజి లో మా చిత్రం సంజీవిని వుంటుంది. పిల్ల‌లు , ఫ్యామిలి ఆడియ‌న్స్ అమితంగా ఇష్ట‌ప‌డే చిత్రం గా సంజీవిని వుంటుంది.

ఈచిత్రాన్ని నేను చూశాను. మే నెలాఖ‌రున విడుద‌ల కి స‌న్నాహ‌లు చేస్తున్నాము. టీజ‌ర్ చూసిన వారంతా ఆశ్య‌ర్యంతో ఫోన్స్ చేస్తున్నారు. ఇది హ‌లీవుడ్ చిత్రం అనుకున్నాం అంటూ ప్ర‌శంశ‌లు కురిపిస్తున్నారు. ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ప‌డిన క‌ష్టం టీజ‌ర్ లో క‌నిపిస్తుంది. త‌ప్ప‌కుండా ఈ చిత్రం మంచి విజ‌యాన్ని సాధిస్తుంది. అని అన్నారు.

More News

నాలుగేళ్ళ త‌రువాత బాల‌య్య‌తో..

రెండుత‌రాల‌కి చెందిన అగ్ర క‌థానాయ‌కులంద‌రితోనూ విజ‌యాలు అందుకున్న సంగీత ద‌ర్శ‌కుల‌లో దేవిశ్రీ ప్ర‌సాద్ ఒక‌రు.

ఫిదా విడుద‌లైన రోజునే..

ఫిదా.. గ‌తేడాది సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్ర‌మిది. వ‌రుణ్ తేజ్‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన ఈ సినిమా..

'నేల టిక్కెట్టు' ఆడియో విడుద‌ల‌

ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కళ్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో, మాస్ మహారాజా 'రవితేజ' హీరోగా రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నచిత్రం “నేల టిక్కెట్టు. రవితేజ సరసన మాళ్వికా శర్మ హీరోయిన్‌గా నటించారు.

సైరా ఆగ‌మ‌నం ఎప్పుడంటే..

ఖైదీ నెం.150తో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. త‌న కెరీర్‌లో 150వ సినిమాగా తెర‌కెక్కిన ఈ సినిమాతో..

చైత‌న్య సంద‌డి అప్పుడే!

గ‌తేడాది వేస‌వికి రారండోయ్ వేడుక చూద్దాం అంటూ ఓ మంచి విజ‌యాన్ని అందుకున్నారు యువ‌క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌. ఆ త‌రువాత చేసిన యుద్ధం శ‌ర‌ణం నిరాశ‌ప‌రిచింది.