హాలివుడ్ స్థాయి గ్రాఫిక్స్ తో ముస్తాబవుతున్న సంజీవని
Send us your feedback to audioarticles@vaarta.com
హాలివుడ్ స్థాయి గ్రాఫిక్స్ తో విభిన్న కథాంశం తో తెలుగులో తెరకెక్కుతున్న చిత్రం సంజీవని. రవి వీడే దర్శకత్వంలో రూపొందుతున్న ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ హిమాలయాలు, రోటాంగ్, మనాలి, నల్లమల తదితర లొకేషన్లలో చాలా సాహసోపేతంగా చిత్రీకరించబడింది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ మంచి ప్రేక్షకాదరణ పొందింది. ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు హైదరాబాద్ కు చెందిన వెక్టార్ ఎఫ్ ఎక్స్ స్టూడియోలో శరవేగంగా జరుగుతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆగస్ట్ కల్లా పూర్తి చేసి సాధ్యమయినన్ని ఎక్కువ స్క్రీన్స్ లో సినెమాను రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
మనోజ్ చంద్ర, అనురాగ్ దేవ్, తనూజ ప్రధాన తారాగనంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంగీత దర్శకుడు శ్రవన్ కే కే. దేవి, శివ ఆనిమేషన్ మరియు విజుయల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్స్ కాగా జి. నివాస్ ఈ చిత్రాన్ని నివాస్ క్రియేషన్స్ బానర్ పై నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com