సంజయ్ దత్ హీరోగా బాలీవుడ్ ప్రస్థానం..
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ప్రస్థానం హిందీ రీమేక్ లో నటించనున్నారు. ఒరిజినల్ ను తెరకెక్కించిన దేవాకట్టానే హిందీలోనూ దర్శకుడు. అక్కడ సాయికుమార్ పాత్రను ఖల్ నాయక్ సంజయ్ దత్.. శర్వానంద్ పాత్రలో అలీ ఫాజల్ నటించనున్నారు.
2010లో విడుదలైన ప్రస్థానంకు ఎన్నో అవార్డులు వచ్చాయి. ఇక శర్వానంద్, సాయికుమార్ కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. రాజకీయ నేపథ్యంలో సాగే ప్రస్థానం గోవాలో జరిగిన ఇండియన్ పనోరమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు కూడా ఎంపికైంది.
ఈ కథ నచ్చి సంజయ్ దత్ ప్రొడక్షన్ హౌజ్ సంస్థలో ఆయనే సినిమాను నిర్మిస్తున్నారు. అమైరా దస్తూర్ హీరోయిన్ గా నటిస్తుంది. జూన్ 1న సంజయ్ దత్ తల్లి నర్గీస్ జన్మదినం సందర్భంగా షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com