కరోనా ఎక్కువగా ఉన్నప్పుడు సెలవు పెట్టమని చెప్పా.. కానీ నా భర్త..
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోయిన్ సంజన గల్రాని గత ఏడాది లాక్ డౌన్ సమయంలో వివాహం చేసుకుంది. తనకు పెళ్లయిపోయింది అంటూ సీక్రెట్ మ్యారేజ్ గురించి ఇటీవలే రివీల్ చేసింది. గత ఏడాది డ్రగ్స్ వివాదంలో చిక్కుకోవడం వల్ల తన పెళ్లి విషయాన్ని ఎవరికీ చెప్పలేదని సంజన పేర్కొంది.
కర్ణాటకకు చెందిన అజీజ్ పాషా అనే వైద్యుడిని సంజన వివాహం చేసుకుంది. ప్రస్తుతం భర్తతో కలసి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. నేడు డాక్టర్స్ డే సందర్భంగా సంజన సోషల్ మీడియాలో వైద్యులందరికి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపింది. తన భర్త పాషా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఇదీ చదవండి: దుబ్బాకలో హృదయ విదారక ఘటన.. ఆపద్భాంధవుడైన సంపూర్ణేష్ బాబు
'డాక్టర్లు రియల్ హీరోలు.. ఈ విపత్కర సమయంలో ఆ విషయం మనందరికీ అర్థం అయింది. వైద్యులు ఎన్నో మిళియన్ల మంది ప్రాణాలు రక్షిస్తున్నారు. వారి జీవితాలని త్యాగం చేసి మరీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్యులు విధులు నిర్వహిస్తున్నారు.
నేను కూడా ఓ వైద్యుడి భార్యనే. ఈ విపత్కర సమయంలో నా భర్తకు అనేకసార్లు చెప్పా. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న టైంలో కనీసం నెలరోజులైనా సెలవు పెట్టమని అడిగా. అలా అయినా ఇద్దరం కలసి ఉండే టైం పెరుగుతుంది అని అడిగా. కానీ ఆయన చెప్పిన సమాధానం ఎప్పటికీ మరచిపోలేను. నేను వైద్యుడిని. అనారోగ్యంతో, ప్రాణాపాయంలో ఉన్న వారికీ చికిత్స అందించడం నా వృత్తి. నా మొదటి ప్రాధాన్యత దానికే అని సమాధానం ఇచ్చారు.
ఈ విషయంలో కేవలం నా భర్త మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్న వైద్యులంతా నాకు ఆదర్శంగా నిలిచారు. నిస్వార్థంగా ప్రజల ప్రాణాలు కాపాడుతున్న రియల్ హీరోలు డాక్టర్లకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు. ఓ డాక్టర్ కు భార్యనైనందుకు గర్వంగా ఉంది' అని సంజన తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో పేర్కొంది.
సంజన టాలీవుడ్ లోకి సోగ్గాడు చిత్రంతో అడుగుపెట్టింది. ఆ తర్వాత పూరి జగన్నాధ్ దర్శత్వంలో 'బుజ్జిగాడు' చిత్రంలో నటించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments