అలసిపోయా ఇక ఆడలేను.. ఇదే నా చివరి సీజన్ : టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన సానియా
Send us your feedback to audioarticles@vaarta.com
భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన టెన్నిస్ కెరీర్‌కు వీడ్కోలు ప్రణాళికలు వెల్లడించింది. 2022 ఏడాది ఆఖర్లో ఆటకు గుడ్‌బై చెప్పేస్తానని ప్రకటించింది. ఆస్ట్రేలియా ఓపెన్ 2022 డబుల్స్‌లో తొలి రౌండ్లోనే ఆమె ఓటమి చవిచూసింది. ఆ వెంటనే సానియా మీడియాతో మాట్లాడింది.
'నా చివరి సీజన్ ఇదేనని నిర్ణయించుకున్నా. ఇక నుంచి వారం వారం సమీక్షించుకుంటాను. వాస్తవానికి ఈ సీజన్ చివరి వరకు కొనసాగుతానో లేదో చెప్పలేను అంటూ సానియా మీర్జా వెల్లడించారు. 'ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని... టెన్నిస్ వల్ల తన మూడేళ్ల కొడుకును రిస్క్‌లో పెడుతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తాను త్వరగా అలసిపోతున్నానని... గాయాల పాలవుతున్నానని సానియా మీర్జా చెప్పారు. ఈ రోజు తన మోకాలు చాలా ఇబ్బంది పెట్టిందని సానియా తెలిపారు. తన వయసు పెరగడం వల్ల కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతోంది అని ఆమె చెప్పారు.
కాగా.. ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల డబుల్స్‌లో సానియా ఓటమి పాలైనా అక్కడే ఉండనుంది. అమెరికాకు చెందిన రాజీవ్ రామ్‌తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా ఆడనుంది. సుదీర్ఘ కెరీర్‌లో ఇప్పటి వరకు సానియా ఆరు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచింది. డబుల్స్‌లో నెంబర్‌వన్ స్థాయికి సైతం చేరుకుంది. డబ్ల్యూటీఏ సింగిల్స్‌లో టాప్-30లో ప్రవేశించిన తొలి భారతీయురాలిగా సానియా మీర్జా రికార్డుల్లోకెక్కింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments