Meta India : మెటా ఇండియా హెడ్‌గా సంధ్యా దేవనాథన్ ... మన ఆంధ్రా యూనిర్సిటీలో చదివి ఉన్నత శిఖరాలకు
Send us your feedback to audioarticles@vaarta.com
అంతర్జాతీయ దిగ్గజ సంస్థలకు భారతీయులు సారథులుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, పెప్సీ, అడోబ్, మాస్టర్ కార్డ్ వంటి మల్టీనేషనల్ కంపెనీలకు భారతీయులు సీఈవోలు వ్యవహరిస్తూ.. ఆయా సంస్థలను అభివృద్ధి బాటలో నడుపుతున్నారు. ఈ జాబితాలో స్థానం దక్కించుకున్నారు సంధ్యా దేవనాథన్. ఫేస్‌బుక్ మాతృసంస్థ ‘మెటా’’ ఇండియా విభాగం అధిపతిగా ఆమె నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఈ పదవిలో వున్న అజిత్ మోహన్ రాజీనామా చేయడంతో సంధ్యను అదృష్టం వరించింది. ఆర్ధిక మాంద్యం, ఖర్చు తగ్గించుకునే చర్యల్లో మెటా వున్న సంగతి తెలిసిందే. అలాంటి పరిస్ధితుల్లో సంధ్యకు ఈ పదవి దక్కడం మామూలు విషయం కాదు. 2023 జనవరి 1 నుంచి ఆమె కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఆంధ్రా యూనివర్సిటీలో బీటెక్:
ఇక సంధ్యా దేవనాథన్ చదువు, ఇతర వివరాల్లోకి వెళితే.. ఆమె 1998లో ఆంధ్రా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి బీటెక్ పూర్తి చేశారు. అనంతరం ఢిల్లీ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (ఎఫ్ఎంఎస్) నుంచి ఎంబీఏ పట్టా పొందారు. బిజినెస్ లీడర్‌గా సంధ్యకు 22 సంవత్సరాల అనుభవం వుంది.
ఆరేళ్లలోనే మెటా ఇండియా హెడ్ స్థాయికి:
2016లో మెటాలో చేరిన సంధ్య అంచెలంచెలుగా ఎదిగారు. సింగపూర్, వియత్నాంలలో సంస్థ వ్యాపారం వృద్ధి చెందడం వెనుక కీలక పాత్ర పోషించారు. అనంతరం ఆగ్నేయాసియా దేశాల్లో ఈ కామర్స్ కార్యకలాపాల్లోనూ చురుగ్గా వ్యవహరించారు. రెండేళ్ల క్రితం ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో మెటా గేమింగ్ యత్నాలకు నాయకత్వం వహించారు. మెటాతో పాటు పెప్పర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్లోబల్ బోర్డ్‌లోనూ సంధ్య పనిచేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout