వెబ్ సిరీస్ ఆలోచనల్లో సందీప్ వంగా..?
Send us your feedback to audioarticles@vaarta.com
తొలి చిత్రం `అర్జున్ రెడ్డి`తో తెలుగులో భారీ హిట్‌ను సొంతం చేసుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా ఎదిగాడు. తర్వాత సందీప్ తన మకాంను ముంబైకి మార్చాడు. తెలుగులో తనకు డైరెక్టర్‌గా పేరు తెచ్చిన అర్జున్ రెడ్డి చిత్రాన్నే కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కించి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. 2019లో విడుదలైన బాలీవుడ్ చిత్రాలన్నింటిలో కబీర్ సింగ్ భారీ విజయాన్ని దక్కించుకుంది. షాహిద్‌కపూర్‌కు ఈ సినిమాతో స్టార్ హీరో రేంజ్ దక్కింది. ఈ సినిమా తర్వాత సందీప్ వంగా మరో సినిమాను తెరకెక్కించలేదు. అనౌన్స్ చేసిన బాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
టాలీవుడ్లో సెన్సేషనల్ హిట్ అందించినా కూడా స్టార్ హీరోలెవరు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం కరోనా సమయం కూడా సందీప్ తదుపరి ప్రాజెక్ట్ ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో సందీప్ వంగా ఓ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించాలని ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశాట్ట. పరిస్థితులు కాస్త చక్క బడగానే తన వెబ్ సిరీస్‌ను తెరకెక్కించడానికి రెడీ అయిపోనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com