ప్రభాస్ 'స్పిరిట్' కథ చెప్పేసిన సందీప్ రెడ్డి.. మామాలుగా లేదుగా..
Send us your feedback to audioarticles@vaarta.com
'అర్జున్ రెడ్డి', 'యానిమల్' సినిమాలతో దేశవ్యాప్తంగా దర్శకుడు సందీప్ రెడ్డి విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. తన సినిమాల్లో చూపించే హీరో యాటిట్యూడ్‌కి ఓ వర్గం అభిమానులు ఫిదా అయిపోతున్నారు. అయితే కొంతమంది మాత్రం విమర్శలకు దిగుతుంటారు. కానీ ఆ విమర్శలను పట్టించుకోకుండా తనదైన శైలిలో వెళ్తూ ఉంటాడు. యానిమల్ సినిమా బ్లాక్‌బస్టర్ తర్వాత తన తర్వాతి చిత్రం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే రెబల్ స్టార్ ప్రభాస్‌తో తన తదుపరి సినిమా ఉంటుందని చెప్పి డార్లింగ్ ఫ్యాన్స్‌లో జోష్ నింపాడు.
దీంతో ప్రభాస్ అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న 'స్పిరిట్' సినిమాలో ప్రభాస్ మొదటిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రని పోషిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాలను సందీప్ రీసెంట్ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. ఏకంగా ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడుతూ.. "ప్రభాస్ ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. అలాంటి ఆఫీసర్ జీవితంలో తనకి బాగా దగ్గరైన వ్యక్తి విషయంలో ఒక తప్పు జరుగుతుంది. ఆ తరువాత ఆ పోలీస్ ఆఫీసర్ ఎలా రియాక్ట్ అయ్యాడు" అనేది మూవీ కథ అని తెలిపాడు.
ఇప్పటికే సినిమా స్క్రిప్ట్ 60 శాతం పూర్తి అయ్యిందని.. డిసెంబర్ నాటికీ స్క్రిప్ట్ మొత్తం పూర్తి చేసి.. షూటింగ్‌కి వెళ్తామని పేర్కొన్నాడు. ఈ మూవీని రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తీస్తున్నట్లు వెల్లడించాడు. ట్రైలర్, టీజర్ ఆడియన్స్‌కి రీచ్ అయితే.. ప్రభాస్ ఇమేజ్‌కి తొలి రోజే రూ.150 కోట్లు వచ్చేస్తాయని ధీమా వ్యక్తం చేశాడు. అంతేకాకుండా "యానిమల్ సినిమా కంటే ముందు ప్రభాస్ ఒక హాలీవుడ్ సినిమాని రీమేక్ చేద్దామని నన్ను సంప్రదించాడు. అప్పుడు ఈ ఆలోచన మీకు బాగా పని చేస్తుందని నేను సూచించాను. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఆ తర్వాత ‘స్పిరిట్’ కథతో ప్రభాస్ ముందుకి వెళ్లాను. ఆ కథ ప్రభాస్‌కు బాగా నచ్చింది. ఈ సినిమా పూర్తి కాగానే రణ్‌బీర్ కపూర్‌తో ‘యానిమల్ పార్క్' చేస్తా" అని చెప్పుకొచ్చాడు.
ఇదిలా ఉంటే ప్రభాస్ సినిమాల విషయానికొస్తే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటిస్తున్న 'కల్కి' సినిమా మే 30వ తేదీని మూవీని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఉగాది పండుగ నుంచి ప్రమోషన్స్ చేయనున్నట్లు సమాచారం. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మహాశివరాత్రి సందర్భంగా ప్రభాస్ క్యారెక్టర్ పేరును రివీల్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ప్రభాస్ పాత్ర పేరు 'భైరవ' అని చెబుతూ పొడవాటి జట్టు, పిలకతో స్టైలిష్‌గా ఉన్నాడు. కాగా ఈ మూవీతో పాటు మారుతి దర్శకత్వంలో 'రాజాసాబ్' చిత్రంలోనూ నటిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com