సందీప్ కిషన్ 'తెనాలి రామకృష్ణ బి.ఎ., బి.ఎల్' ఫస్ట్ లుక్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
యువ కథానాయకుడు సందీప్ కిషన్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'తెనాలి రామకృష్ణ బి.ఎ బి.ఎల్'. 'కేసులు ఇవ్వండి ప్లీజ్' ట్యాగ్ లైన్. తెలుగు, తమిళ భాషల్లో సినిమా రూపొందుతోంది. శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్ బ్యానర్‌పై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జగదీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్నారు.
ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను సందీప్‌కిషన్ పుట్టినరోజు(మే 7) సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో సందీప్ కిషన్ లాయర్ పాత్రలో కనపడుతున్నారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ చిత్రాలను తెరకెక్కించడంలో మంచి పేరున్న దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి ఈ చిత్రాన్ని కూడా తనదైన స్టైల్లో లాఫింగ్ రైడర్‌గా రూపొందిస్తున్నారు. హన్సిక, వరలక్ష్మి శరత్‌కుమార్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
నేటి నుండి రామోజీ ఫిలిం సిటీలో కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ షెడ్యూల్‌లో ఎంటైర్ యూనిట్ పాల్గొంటుంది. సాయికార్తీక్ సంగీతం, సాయిశ్రీరాం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com