అసలేం జరిగిందిలో సంచితా పదుకునే 

  • IndiaGlitz, [Saturday,February 23 2019]

రోజాపూలు, ఒకరికిఒకరు, పోలీస్ పోలీస్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే.. వంటి విజయవంతమైన చిత్రాలతో అందరికి సుపరిచితుడైన కథానాయకుడు శ్రీరామ్ కొంత విరామం తరువాత తెలుగులో నటిస్తున్న చిత్రం అసలేం జరిగింది. ఈ చిత్రంలో శ్రీరామ్ సరసన కన్నడ భామ సంచితా పదుకునే నాయికగా నటిస్తోంది.

ఎక్సోడస్ మీడియా పతాకంపై శ్రీమతి నీలిమ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్ ఎన్‌వీఆర్ తొలిసారి దర్శకత్వ బాధ్యతల్ని చేపట్టారు. మ్యూజిక్ డైరెక్టర్ మహావీర్ ఈ సినిమాకు చక్కటి సంగీతాన్ని అందిస్తున్నారు. నెర్రపల్లి వాసు అద్భుతమైన కథను సమకూర్చారు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం విశేషాలను సహ నిర్మాత కింగ్ జాన్సన్ కొయ్యడ తెలియజేస్తూగ్రామీణ నేపథ్యంలో కొనసాగే ఒక సస్పెన్స్ లవ్‌స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం.

హీరో శ్రీరామ్, సంచితాపదుకునే జంట చక్కగా కుదిరింది. అందం, అభినయం కలగలిసిన అచ్చ తెలుగుఅమ్మాయిలా సంచితా పదుకునే ఈ చిత్రంలో కనిపిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుతున్నాం. మే చివరిలోపు సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు.

More News

'మిఠాయి' పై రాహుల్ రామకృష్ణ పిచ్చి ట్వీట్స్..

టాలీవుడ్‌‌లో విజయదేవరకొండ 'అర్జున్‌‌రెడ్డి', 'గీత గోవిందం' మూవీలతో ఎంత పేరు తెచ్చుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండే రెండు సినిమాలతో టాప్ హీరోల జాబితాలో చేరిపోయాడు.

'ప్రాణం ఖరీదు' సాంగ్ టీజర్ ను విడుదల చేసిన వందేమాతరం శ్రీనివాస్

ప్రశాంత్ అవంతిక  హీరోయిన్ గా నందమూరి తారకరత్న ముఖ్య పాత్రలో యన్. ఎస్ క్రియేషన్స్ పతాకంపై పద్మప్రియ సమర్పణలో నల్లమోపు సుబ్బారెడ్డి

బాబు ఓడిపోతున్నారు.. గెలిచేది వైసీపీనే.: కేటీఆర్

గత కొన్నిరోజులుగా ఏపీలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. టీడీపీ సిట్టింగ్‌‌లు అందరూ ఆ పార్టీకి టాటా చెప్పేసి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌‌రెడ్డి

కేసీఆర్ కేబినెట్‌‌లో ఇద్దరు మహిళలకు అవకాశం

తెలంగాణ కేబినెట్ మొదటి విస్తరణ ఇప్పటికే ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విస్తరణలో మహిళా ఎమ్మెల్యేలకే కాదు సొంత ఇంట్లోని వారికి కూడా గులాబీ బాస్,

టికెట్ దక్కించుకున్న టీడీపీ అభ్యర్థికి ఊహించని షాక్!

ఆంధ్రప్రదేశ్‌‌లో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే అటు వైసీపీ.. ఇటు టీడీపీ అధిష్టానాలు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.