సచిన్ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారికి సంబంధించిన సెకండ్ వేవ్ బీభత్సంగా ఉంది. ఒక్కసారిగా కేసుల సంఖ్య దారుణంగా పెరిగిపోతోంది. తిరిగి గతేడాది అక్టోబర్ నాటి రోజులను కరోనా గుర్తు చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ మహమ్మారి బారిన సెలబ్రిటీలు పడుతున్నారు. ఇప్పటికే పలువురు తమకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ప్రకటించారు. తాజాగా భారత్ క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని సచిన్ ట్విటర్ వేదికగా స్వయంగా వెల్లడించారు.
తాను స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడుతున్నానని పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని సచిన్ తెలిపారు. ‘‘కరోనా సోకుకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ ఎప్పటికప్పుడు కరోనా పరీక్షలు చేయించుకుంటున్నాను. తాజాగా చేయించుకున్న పరీక్షలో నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా లక్షణాలు చాలా స్వల్పంగా ఉన్నాయి. మా ఇంట్లో మిగిలిన అందరికీ నెగిటివ్ వచ్చింది. నేను ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంటూ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాను. నాకు, నాతో పాటు దేశ వ్యాప్తంగా ఎందరికో మద్దతుగా నిలుస్తున్న వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపాలనుకుంటున్నాను. అందరూ జాగ్రత్తగా ఉండండి’’ అని సచిన్ ట్వీట్ చేశారు.
— Sachin Tendulkar (@sachin_rt) March 27, 2021
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments