డ్రగ్స్ వ్యవహారం.. అందుకే రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది!
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోయిన్ సంజన టాలీవుడ్ లోకి సోగ్గాడు చిత్రంతో అడుగుపెట్టింది. ఆ తర్వాత పూరి జగన్నాధ్ దర్శత్వంలో 'బుజ్జిగాడు' చిత్రంలో నటించింది. అరకొర అవకాశాలతో కెరీర్ నెట్టుకొస్తోంది సంజన. ఇదిలా ఉండగా ఈమె లైఫ్ లో వివాదాలు కూడా ఉన్నాయి.
ఇదీ చదవండి: ఇదేం ట్విస్టు.. 'విరాటపర్వం' నక్సలిజం కథ కాదా ?
సంజన గత ఏడాది శాండల్ వుడ్ డ్రగ్స్ వ్యవహారంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల సంజన తనకు పెళ్ళైపోయిందంటూ షాకిచ్చింది. గత ఏడాది లాక్ డౌన్ లోనే వివాహం చేసుకున్నానని సంజన అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. కర్ణాటకలోని పాషా అనే డాక్టర్ ని సంజన వివాహం చేసుకుంది. ఇంత రహస్యంగా ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో సంజన తాజాగా వివరించింది.
నా పెళ్లి కుదిరిన వెంటనే డ్రగ్స్ కేసులో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీనితో ఆ సమయంలో నా పెళ్లి గురించి ఎవరికీ చెప్పలేకపోయాను. అయినప్పటికీ గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. లాక్ డౌన్ వల్ల అది కూడా కుదరలేదు అని సంజన చెప్పుకొచ్చింది.
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సంజన ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చింది. బుజ్జిగాడు చిత్రంతో పాటు సర్దార్ గబ్బర్ సింగ్, దండుపాళ్యం 2 చిత్రాలలో సంజన నటించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments