Johnny Movie : పవన్ కళ్యాణ్ ‘‘జానీ’’ మూవీ రిజల్ట్‌పై సంయుక్త మీనన్ సంచలన వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
‘‘జానీ ’’.. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కి, ఆయన అభిమానులకు ఎంతో ప్రత్యేకం. హీరోగా వరుసగా ఏడు హిట్లు కొట్టిన తర్వాత ఎవ్వరూ ఊహించని విధంగా మెగా ఫోన్ పట్టారు పవన్. అదొక్కటే కాదు.. కథ , స్క్రీన్ ప్లే, ఫైట్స్ బాధ్యత కూడా ఆయనే చేపట్టారు. అయితే నాటి జనాలకు ఆ స్క్రీన్‌ప్లే, కథ కొత్తగా వుండటంతో జానీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. కానీ ఈ సినిమాను పవన్ కొత్తగా తీశారని ఈ తరం చెబుతూ వుంటారు. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, పాటలు, ఫైట్స్ 20 ఏళ్ల అడ్వాన్స్ టెక్నాలజీతో తీశారు. దీనికి తోడు జానీలో నటించిన రేణూ దేశాయ్.. తర్వాతి కాలంలో పవన్ కల్యాణ్‌కు జీవిత భాగస్వామిగానూ మారారు. అందువల్ల ఈ సినిమా పవన్ ఫ్యాన్స్‌కు ఎంతో ప్రత్యేకం.
అప్పట్లో 300 థియేటర్లలో రిలీజైన జానీ :
నటరత్న ఎన్టీఆర్ నటించిన ‘‘చిట్టిచెల్లెలు’’లోని ‘‘ ఈ రేయి తీయనిది’’ పాటను జానీ కోసం పవన్ రీమిక్స్ చేచించారు. దీనితో పాటు ‘‘లెట్స్ గో జానీ’’, ‘‘రావోయి మా కంట్రీకి’’, ‘‘ధర్మార్ధ కామములలోన’’, నా రాజు గాకుర అన్నయ్య’’ వంటి పాటలు నేటికీ మారుమోగుతాయి. పవన్ స్వీయ దర్శకత్వంలో విడుదలైన సినిమా కావడంతో జానీకి రికార్డ్ లెవల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. అప్పట్లో దాదాపు 300కు థియేటర్లలో విడుదలైన జానీ అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.
జానీని ఎన్నోసార్లు చూశానన్న సంయుక్త :
ఈ నేపథ్యంలో జానీ సినిమాపై స్పందించారు టాలీవుడ్ లేటెస్ట్ స్టార్ హీరోయిన్ సంయుక్త మీనన్. సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్‌తో కలిసి నటించిన ‘‘విరూపాక్ష’’ సూపర్ హిట్ కావడంతో ఆమె గోల్డెన్ హ్యాండ్‌గా మారిపోయారు. ప్రస్తుతం సక్సెస్ జోష్‌లో వున్న సంయుక్త.. పలు ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో indiaglitz.comతో మాట్లాడుతుండగా.. పవన్ కళ్యాన్ ‘‘జానీ’’ మూవీ ప్రస్తావన వచ్చింది. ఈ సినిమా థియేటర్లో హిట్టా కాదా అని సంయుక్త యాంకర్‌ను అడగ్గా.. కాలేదని అతను చెబుతాడు. ఈ సందర్భంగా ఆ సినిమాను తాను ఎన్నో సార్లు చూశానని.. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, కథ, పాటలు అద్భుతంగా వుంటాయని సంయుక్త చెబుతుంది. కానీ తుది నిర్ణయం ప్రేక్షకులదేనని ఆమె చెబుతారు. ప్రస్తుతం సంయుక్త మీనన్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments