Vimanam Trailer: ఏడిపించేసిన తండ్రీకొడుకులు.. ఓ అందమైన కల, భావోద్వేగాల చుట్టూ తిరిగే 'విమానం'
Send us your feedback to audioarticles@vaarta.com
శివప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి క్రియేట్ వర్కస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘‘విమానం’’. విలక్షణ నటుడు , దర్శకుడు సముద్రఖని ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో సినిమాను రిలీజ్ చేయనున్నారు. మీరా జాస్మిన్, రాజేంద్రన్ , ధనరాజ్, రాహుల్ రామకృష్ణ, మాస్టర్ ధ్రువన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన విమానం టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బస్తీలో వుండే అంగవైకల్యంతో బాధపడే తండ్రి, అతని కొడుకు విమానం ఎక్కాలనే కల ఇతివృత్తంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతూ వుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసింది. దీనిలో భాగంగా గురువారం విమానం ట్రైలర్ రిలీజ్ చేసింది. సినీనటి అనుపమా పరమేశ్వరన్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
ఈ విమానం కనిపెట్టినోడు ఎవడ్రా బాబు :
మరి అది ఎలా వుందో చూస్తే.. మూడు చక్రాల సైకిల్లో వీరయ్య (సముద్రఖని) వస్తూ వుంటాడు. అప్పుడు ఆటో స్టాండ్‌లో వుండే వాళ్లు హేళనగా మాట్లాడతారు. వాడి కొడుకు విమానం గురించి చెప్పడానికి కొంత, స్కూల్లో ఎలా చదువుతున్నాడో అడగడానికి ఇంకొంత, గుడిలో కొంత.. అలా లేట్ అయ్యిందంటూ ఆటో నడుపుకునే ధన్‌రాజ్ చులకనగా మాట్లాడతాడు. ఇక పదే పదే విమానం బొమ్మలు కొనుక్కునే కొడుకుని వీరయ్య.. ఇక చాల్లే అన్నట్లుగా చెబుతాడు. అప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో 50 విమానాలు వుంటాయి నాన్న అని కొడుకు చెబుతాడు. కొడుకు బాధ తట్టుకోలేక.. విమానం కనిపెట్టినోడు ఎవడ్రా బాబు అంటూ వీరయ్య తల బాదుకుంటూ వుంటాడు.
కొడుకుని వీరయ్య విమానం ఎక్కించాడా :
చివరికి కొడుకును ఎలాగైనా విమానం ఎక్కించాలని నిర్ణయం తీసుకుంటాడు వీరయ్య. అయితే అందుకు రూ.10000 అవుతుందని ట్రావెల్ ఏజెన్సీ వాళ్లు చెప్పడంతో దానిని సంపాదించేందుకు వీరయ్య పడే ఆవేదన , అంగవైకల్యంతో బాధపడుతూనే పనికి వెళ్లడం హృదయాలను హత్తుకునేలా వుంది. సినిమా మధ్యలో అనసూయ గ్లామర్ టచ్ ఇచ్చినప్పటికీ.. ‘‘ఇప్పటిదాకా మోకాళ్లపైన పట్టుకునే మగాళ్లనే చూశా.. కానీ మొదటిసారి మోకాళ్ల కింద పాదాలను పట్టుకుంటుంటే చానా కష్టంగా వుందిరా’’ అంటూ ఆమె చెప్పే డైలాగ్ కంటతడి పెట్టించికమానదు. మరి వీరయ్యను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారు.. ఆ బాబు విమానం ఎక్కాడా.. వీరయ్య అనుకున్న లక్ష్యాన్ని సాధించాడా.. ఇవన్నీ తెలియలంటే ‘‘విమానం’’ చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com