హాట్ స్టార్ తో సంపూ సెన్సేషన్..!
Saturday, October 22, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు తాజా చిత్రం కొబ్బరిమట్ట. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.సంపూ ఇప్పుడు మరో మూవీతో ఆడియోన్స్ కు సర్ ఫ్రైజ్ ఇ్వడానికి రెడీ అవుతున్నాడు. హాట్ స్టార్ పూనమ్ పాండే ప్రధాన పాత్రలో భవానీ మస్తాన్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రంలో సంపూ అతిథి పాత్ర పోషిస్తుండడం విశేషం.
ఈ చిత్రాన్ని ఫకృద్దీన్ ఖాన్, విజయ్ భాస్కర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు ఈ చిత్ర విశేషాలను తెలియచేస్తూ...ముక్కోణపు ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో సంపూ క్యారెక్టర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నాం. ఈనెలాఖరు నుంచి ముంబైలో సెకండ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం అని తెలియచేసారు. హాట్ స్టార్ పూనమ్ పాండే సినిమాలో సంపూ గెస్ట్ రోల్ ఎలా ఉంటుందో చూడాలి..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments