సిద్దిపేటలో సంపూకు తృటిలో తప్పిన రోడ్డు ప్రమాదం
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ నటుడు, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. వివారాల్లోకెళితే.. సిద్దిపేట కొత్త బస్టాండ్ వద్ద సంపూర్ణేష్ కారును.. ఆర్టీసి బస్సు ఢీ కొన్నది. అయితే ప్రమాదం జరిగినప్పుడు కారులోనే సంపూ.. కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ ప్రమాదంలో సంపూ, భార్య, కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. కారు ముందు భాగం స్వల్పంగా ధ్వంసమైంది. ఎలాంటి పెను ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో బర్నింగ్ స్టార్ ఫ్యామిలీ, ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆర్టీసీకి టెంపరరీ డ్రైవర్ బస్సు నడపడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా ఆర్టీసీ సమ్మె ప్రారంభం అనంతరం పలు చోట్ల కాంట్రాక్ట్ డ్రైవర్లు రోడ్డు ప్రమాదాలు చేసిన విషయం విదితమే.
అయితే తాజాగా.. సిద్దిపేటలో సంపూ కారు ఆర్టీసీ బస్సు ఢీ కొన్నది. ఈ ప్రమాదంపై సంపూర్ణేష్ బాబు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో ఏం చెప్పాడు..? అనే విషయం తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఘటన అనంతరం ఆర్టీసీ డ్రైవర్ పరారయ్యాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. మంగళవారం నాడు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఆర్టీసీ డ్రైవర్.. బైక్‌పై వెళ్తున్న మహిళను ఢీ కొనడంతో అక్కడికక్కడే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతూనే ఉన్నా.. డ్రైవర్లు మాత్రం అప్రమత్తం కావట్లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com