‘క్యాలీఫ్లవర్’ నవంబర్ 26న విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
‘హృదయ కాలేయం’ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌బాబు ప్రస్తుతం క్యాలీ ఫ్లవర్’ అనే సరికొత్త టైటిల్‌తో మనముందుకు రానున్నారు. ‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ఉపశీర్షిక. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని నవంబరు 26న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు నిర్మాతలు. ఈ సంధర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటుంది.
గుడూరు శ్రీధర్ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్ పతాకాలపై ఆశా జ్యోతి గోగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్కే మలినేని ఈ సినిమాకు దర్శకులు. ఈ చిత్రంలో సంపూర్ణేష్‌బాబు సరసన వాసంతి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రజ్వల్ క్రిష్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ముజీర్ మాలిక్ ఛాయగ్రాహకుడు. ఎడిటింగ్ బాధ్యతలను బాబు నిర్వ హిస్తున్నారు.
నటీనటులు: సంపూర్ణేష్‌బాబు, వాసంతి, పోసాని కృష్ణమురళి, ఫృధ్వీ, నాగ మహేశ్, గెటప్ శీను, రోహిని, కాదంబరి కిరణ్, కల్లు కృష్ణారావు, విజయ్, కల్యాణీ, సుమన్ మనవ్వాద్, ముస్కాన్, బేబీ సహృద, రమణ్ దీప్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments