టీజర్ తో సంచలనం సృష్టిస్తున్న సంపూ..
Send us your feedback to audioarticles@vaarta.com
హృదయ కాలేయం సినిమాతో సంచలనం సృష్టించిన సంపూర్ణేష్ బాబు..కొబ్బరిమట్ట సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కొబ్బరిమట్ట టీజర్ ను రిలీజ్ చేసారు. ఈ టీజర్ ఇలా...బయటకు వచ్చిందో లేదో..తెగ చూసేస్తున్నారు. సినీ ప్రముఖులు సైతం ఈ టీజర్ గురించి స్పందిస్తున్నారు. స్టార్ హీరోల టీజర్స్ కి అనూహ్య స్పందన రావడం కామన్. అయితే చిన్ని సినిమాల టీజర్స్ కి మాత్రం అంతగా ఆదరణ లభించదు. అయితే...సంపూ కొబ్బరిమట్ట టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.
హైదరాబాద్ ట్విట్టర్ ట్రెండింగ్ లో కొబ్బరిమట్ట టీజర్ నెంబర్ 1 ప్లేస్ కి రావడం విశేషం. అలాగే కేవలం 9 గంటల్లోనే యుట్యూబ్ లో ఈ టీజర్ కి లక్ష వ్యూస్ రావడం మరో విశేషం. చిన్న సినిమా టీజర్స్ లో ఇదో సరికొత్త రికార్డ్. ఇంతలా కొబ్బరిమట్ట టీజర్ సంచలనం సృష్టించడానికి కారణం...సంపూ చెప్పిన భారీ డైలాగ్. ఈ భారీ డైలాగ్ తో సంపూ తనలో ఓ మంచి నటుడు ఉన్నాడని మరోసారి నిరూపించుకున్నారు.ఈ సినిమా ఇంటర్వెల్ ఎపిసోడ్ లో మరో భారీ డైలాగ్ ఉందట. ఇదంతా చూస్తుంటే...కొబ్బరిమట్టతో సంపూ మరోసారి సంచలనం సృష్టించి ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు అనిపిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com