రేవంత్ నాకు ముద్దుల అన్నయ్య.. జనసేనకు సింగిల్ సర్పంచ్ లేరే!?
Send us your feedback to audioarticles@vaarta.com
రేవంత్.. రేవంత్.. రేవంత్.. గత కొన్ని రోజులుగా ఈ ఫైర్‌బ్రాండ్ పేరు తెలంగాణ రాజకీయాల్లో గట్టిగానే వినపడుతోంది. ఎంపీ గెలిచిన తర్వాత ఢిల్లీ వేదికగా డోస్ పెంచిన రేవంత్.. దేశ రాజధానిలోనే హాట్ టాపిక్ అవుతున్నారు. అయితే.. ఇటీవల రేవంత్ మాత్రం సొంత పార్టీ నేతలకే కష్టమైపోతున్నారు.. ఈయన చేస్తున్న పనులు కేడర్‌కు.. పార్టీ పెద్దలకు అస్సలు నచ్చట్లేదు.. అందుకే మీడియా ముందుకు వచ్చి రేవంత్‌పై కన్నెర్రజేస్తున్నారు.
అసలేం జరిగింది!
ఇక అసలు విషయానికొస్తే.. నల్లమలలో యురేనియం తవ్వకాలకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అంగీకారం తెలిపాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఈ వ్యవహారాన్ని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. తక్షణమే ఈ తవ్వకాలు ఆపకపోతే మరో తెలంగాణ ఉద్యమం రాష్ట్రంలో మొదలవుతుందని ప్రజా సంఘాలు సైతం ప్రభుత్వాలను గట్టిగానే హెచ్చరించాయి. ఈ క్రమంలో జనసేనాధిపతి పవన్ కల్యాణ్ రంగంలోకి దిగారు. పవన్‌కు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత వీహెచ్, ఎంపీ రేవంత్ ఇలా వరుసగా భేటీ అయ్యారు. అయితే మధ్యలో మాజీ ఎమ్మెల్యే సంపత్ పేరు మాత్రం హాట్ టాపిక్ అవుతోంది. జనసేనను పార్టీగా గుర్తించని కాంగ్రెస్.. అసలు ఆ పార్టీలో ఏముందని అఖిలపక్ష సమావేశం అదీ ఇదీ అంటున్నారని పార్టీకి చెందిన నేతలు కన్నెర్రజేశారు. ముఖ్యంగా ఇందులో సంపత్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో రేవంత్ వర్సెస్ సంపత్‌గా పరిస్థితులు మారాయి. మీడియా ముందుకొచ్చి ఈ ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించారు.
సింగిల్ సర్పంచ్ లేరు!
తాజాగా.. సంపత్ మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నాకు సెల్ఫీ పిచ్చి లేదు. నాతో సెల్ఫీ దిగేవారు చాలా మంది ఉన్నారు. సెల్ఫీ రాజకీయాలు ఎవరు చేస్తారో రాష్ట్ర ప్రజలను అడిగితే చెబుతారు. యురేనియం తవ్వకాలపై కాంగ్రెస్ పార్టీ ఎంతో కాలంగా పోరాటం చేస్తోంది.‘జనసేన’ తరఫున కనీసం ఒక్క సర్పంచ్ కూడా లేరు. అటువంటి పార్టీ ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించడం కరెక్టు కాదు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడిన కాంగ్రెస్ పార్టీకి ఎంతో క్రెడిట్ ఉంది. ఆ క్రెడిట్ అంతా వేరే పార్టీకి వెళ్లకూడదు. ‘యురేనియం’ అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ సమావేశం నిర్వహిస్తే వెళతాను కానీ, కాంగ్రెస్ పాత్ర ఏంటన్న విషయం పార్టీలో ముందుగా చర్చ జరగాలి’ అని సంపత్ డిమాండ్ చేశారు.
రేవంత్ నాకు ముద్దుల అన్నయ్య!
‘యురేనియం విషయంలో సంపత్ కు ఏబీసీడీలు కూడా తెలియవని రేవంత్ చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రెండు రోజులుగా తాను ఢిల్లీలో ఉన్నానని, అందుకే, వెంటనే స్పందించలేకపోయాను. నేను పీహెచ్ డీ చేశానని, ఆ విషయం ప్రజలకు తెలుసు. రేవంత్ లా ఏది పడితే అది మాట్లాడను. ఏ విషయంపైన అయినా పూర్తి సమాచారంతోనే మాట్లాడతాను. రేవంత్ నాకు ముద్దుల అన్నయ్య..ఆయన అలా ఎందుకు మాట్లాడారో అర్థం కావట్లేదు’ అని సంపత్ వ్యాఖ్యానించడం గమనార్హం. మరి సంపత్ వ్యాఖ్యలకు రేవంత్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout