సంపత్ నంది నిర్మాతగా కొత్త చిత్రం...
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకుడు సంపత్ నంది సంపత్ టీం వర్క్స్ అనే బ్యానర్‌ను పెట్టి కొత్త వాళ్లను ఎంకరేజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో గాలిపటం సినిమాను సంపత్ నంది నిర్మించిన సంగతి తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత సంపత్ నంది మళ్ళీ తన బ్యానర్‌పై మరో సినిమాను నర్మించనున్నాడు. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ రెడీ అవుతుందట. దర్శకుడు సంపత్ నంది గోపీచంద్ హీరోగా రూపొందుతోన్న చిత్రంతో బిజీగా ఉన్నప్పటికీ సంపత్ నంది ఈ సినిమాకు సంబంధించిన రైటింగ్ వర్క్‌లో బిజీగా ఉన్నాడట. ఈ సినిమాను తను నేను సినిమాలో నటించిన హీరో సంతోష్ శోభన్ హీరోగా నటించనున్నాడు. కొత్త హీరోయిన్‌ను పరిచయం చేయనున్నారని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com