సంపత్ నంది ఆశలు...

  • IndiaGlitz, [Wednesday,December 02 2015]

ఏమైందిఈవేళ' చిత్రంతో స‌క్సెస్ కొట్టిన సంప‌త్ నంది త‌న త‌దుప‌రిచిత్రం ర‌చ్చ‌'ను రామ్ చ‌ర‌ణ్ తేజ్‌తో తెర‌కెక్కించి మ‌రో స‌క్సెస్ అందుకున్నాడు. అబ్బాయితో హిట్ కొట్ట‌డ‌మే ఆలస్యం బాబాయ్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పిలిచి స‌ర్దార్ గబ్బ‌ర్‌సింగ్' ఇవ్వ‌డంతో అంద‌రి చూపు సంప‌త్ నందిపై నిలిచింది. అయితే కార‌ణాలు తెలియ‌లేదు కానీ స‌ర్దార్ గబ్బ‌ర్ సింగ్' ప్రాజెక్ట్ నుండి సంప‌త్ బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు. ప‌వ‌ర్ పేమ్ బాబీ సినిమా డైరెక్ట‌ర్‌గా రీప్లేస్ అయ్యాడు.

దాదాపు సంత్స‌రం పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా చేస్తాన‌ని ఆశ‌తో ఉన్న సంప‌త్ నందికి ఏం చేయాలో పాలుపోలేదు. దాంతో బెంగాల్ టైగ‌ర్ క‌థ‌ను సిద్ధం చేసుకుని నిర్మాత రాధామోన్ స‌పోర్ట్‌తో ర‌వితేజ హీరోగా సినిమాను రెడీ చేశాడు. అవుటండ్ అవుట్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈచిత్రం డిసెంబ‌ర్ 10న రిలీజ్ కానుంది. ఈ సినిమా స‌క్సెస్ అయితే సంప‌త్ నందికి క్రెడిబిలిటీ మ‌రింత పెరుగుతుంద‌న‌డంలో సందేహం లేదు. అంతే కాకుండా సినిమా స‌క్సెస్ ప‌ట్ల యూనిట్ అంతా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. సినిమా స‌క్సెస్ అంద‌రికీ ముఖ్య‌మే కానీ సంప‌త్ నంది త‌న ఆశ‌ల‌ను బెంగాల్ టైగ‌ర్‌'పై పెట్టుకుని ఆశ‌గా భ‌విష్య‌త్ వైపు చూస్తున్నాడు.

More News

వెంకీ కోసం 4 టైటిల్స్...

విక్టరీ వెంకటేష్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.

త్రిష మ్యాజిక్ రిపీట్ చేస్తుందా?

మూడు పదుల వయసు దాటిన తర్వాత త్రిష కూడా త్రిష మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటుంది.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'బెంగాల్ టైగర్'

'బలుపు','పవర్ ' వంటి వరుస సూపర్ హిట్ చిత్రాల తరువాత మాస్ మహరాజ్ రవితేజ హీరోగా,తమన్నా,రాశి ఖన్నా హీరోయిన్స్ గా,రచ్చ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'బెంగాల్ టైగర్'.

సూపర్ స్టార్ గొప్ప మనసు

అకాల వర్షాలతో చెన్నై అతలాకుతలమవుతున్న సంగతి తెలిసిందే.తమిళనాడులోని పలు చోట్ల పడుతున్న వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమై కనిపిస్తున్నాయి.

99 వెహికిల్స్ పై బాలయ్య ఫ్యాన్స్...

నందమూరి నట సింహంబాలక్రిష్ణ నటిస్తున్న 99వ సినిమా డిక్టేటర్.ఈ చిత్రాన్నిశ్రీవాస్ తెరకెక్కిస్తున్నారు.ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ డైరెక్టర్ శ్రీవాస్ తో కలసి ఈ చిత్రాన్నినిర్మిస్తుంది.