సంపత్ నంది ఆశలు...
Send us your feedback to audioarticles@vaarta.com
ఏమైందిఈవేళ` చిత్రంతో సక్సెస్ కొట్టిన సంపత్ నంది తన తదుపరిచిత్రం రచ్చ`ను రామ్ చరణ్ తేజ్‌తో తెరకెక్కించి మరో సక్సెస్ అందుకున్నాడు. అబ్బాయితో హిట్ కొట్టడమే ఆలస్యం బాబాయ్ పవన్‌కళ్యాణ్ పిలిచి సర్దార్ గబ్బర్‌సింగ్` ఇవ్వడంతో అందరి చూపు సంపత్ నందిపై నిలిచింది. అయితే కారణాలు తెలియలేదు కానీ సర్దార్ గబ్బర్ సింగ్` ప్రాజెక్ట్ నుండి సంపత్ బయటకు వచ్చేశాడు. పవర్ పేమ్ బాబీ సినిమా డైరెక్టర్‌గా రీప్లేస్ అయ్యాడు.
దాదాపు సంత్సరం పాటు పవన్ కళ్యాణ్ సినిమా చేస్తానని ఆశతో ఉన్న సంపత్ నందికి ఏం చేయాలో పాలుపోలేదు. దాంతో బెంగాల్ టైగర్ కథను సిద్ధం చేసుకుని నిర్మాత రాధామోన్ సపోర్ట్‌తో రవితేజ హీరోగా సినిమాను రెడీ చేశాడు. అవుటండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈచిత్రం డిసెంబర్ 10న రిలీజ్ కానుంది. ఈ సినిమా సక్సెస్ అయితే సంపత్ నందికి క్రెడిబిలిటీ మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు. అంతే కాకుండా సినిమా సక్సెస్ పట్ల యూనిట్ అంతా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. సినిమా సక్సెస్ అందరికీ ముఖ్యమే కానీ సంపత్ నంది తన ఆశలను బెంగాల్ టైగర్`పై పెట్టుకుని ఆశగా భవిష్యత్ వైపు చూస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com