Sampath Kumar:కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ ఇంట్లో అర్థరాత్రి హైటెన్షన్..
Send us your feedback to audioarticles@vaarta.com
పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో ప్రచారం హీటెక్కుతోంది. ఈ క్రమంలోనే కొన్ని చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్‌లో ఆదివారం అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ ఇంట్లో ఐటీ, విజిలెన్స్ అధికారలమంటూ కొందరు వ్యక్తులు హల్‌చల్ చేశారు. ఆయన ఇంట్లోకి దూసుకెళ్లి వస్తువులు, బట్టలు, సామాగ్రిని చిందరవందరగా పడేశారు.
వచ్చిన వారిని సెర్చ్ వారెంట్ చూపాలని సంపత్ కుమార్ సతీమణి మహాలక్ష్మీ నిలదీసే సమయంలో వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదంలో ఆమె సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో హుటాహుటినా ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో అధికారులను నిర్బంధించేందుకు సంతప్ కుమార్ అనుచరులు ప్రయత్నించగా.. వారు పరార్ అయ్యారు. ఈ ఘటనపై సంపత్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
తాను ఇంట్లో లేని సమయంలో కొందరు దుండగులు ఐటీ, విజిలెన్స్ అధికారులమంటూ తమ ఇంట్లో నానా హంగామా చేశారని మండిపడ్డారు. వారు నిజంగా అధికారులు కాదని.. వారి దగ్గర ఐడీ కార్డులు కూడా లేవని తెలిపారు. తన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని.. ఐటీ అధికారులైతే ఎందుకు పారి పోయారని ప్రశ్నించారు. అలంపూర్‌లో కాంగ్రెస్ గెలుస్తుందని జీర్ణించుకోలేకే అధికార పార్టీ ఈ దుశ్చర్యకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి అనుచరుల పనే అని సంపత్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మొత్తానికి ఈ ఘటనతో అలంపూర్‌లో అర్థరాత్రి పూట ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout