మే 11న 'సమ్మోహనం'తొలి గీతం ఆవిష్కరణ
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమా, సాహిత్యం ఎప్పటికీ బతికే ఉంటాయి అనే ఆసక్తికరమైన డైలాగుతో ఇటీవల విడుదలయిన `సమ్మోహనం` టీజర్‌కి ఎక్స్ ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. సుధీర్‌బాబు హీరోగా మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం `సమ్మోహనం`. బాలీవుడ్ భామ అదితీరావు హైదరీ ఇందులో నాయికగా నటించారు. శ్రీదేవి మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 10గా తెరకెక్కుతోన్న `సమ్మోహనం` జూన్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ `` ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు సర్వత్రా మంచి ప్రశంసలు అందుతున్నాయి. మా చిత్రం ఎలా ఉండబోతోందో సంక్షిప్తంగా ఈ టీజర్లో చూపించాం. మా ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తున్నారు. అదే ఉత్సాహంతో ఈ నెల 11న హీరో సుధీర్‌బాబు పుట్టిన రోజును పురస్కరించుకుని చిత్రంలోని తొలి గీతాన్ని ఆవిష్కరిస్తాం. వివేక్ సాగర్ అందించిన స్వరాలు తప్పకుండా అందరినీ మెప్పిస్తాయి. షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. జూన్ 15న చిత్రాన్ని విడుదల చేస్తాం. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ `సమ్మోహనం`తో సహానుభూతి చెందుతారు `` అని అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ `` ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. టీజర్ లో కనిపించే లొకేషన్ షాట్స్ కీ, హీరో, హీరోయిన్ల మధ్య సంభాషణలకు మంచి స్పందన రావడం ఆనందాన్ని కలిగించింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి`` అని చెప్పారు.
నటీనటులు:సుధీర్‌బాబు, అదితిరావు హైదరి, డా .వీకే నరేశ్, తనికెళ్ల భరణి, పవిత్రా లోకేష్ ,హర్షిణి , నందు, కాదంబరి కిరణ్, హరితేజ, రాహుల్ రామకృష్ణ, కేదార్ శంకర్, శిశిర్‌శర్మ తదితరులు.
సాంకేతిక నిపుణులు: ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: పి. రషీద్ అహ్మద్ ఖాన్, కె. రామాంజనేయులు, కో డైరక్టర్: కోట సురేశ్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్: యస్ . రవీందర్, ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేశ్; డైరక్టర్ ఆఫ్ పొటోగ్రఫీ: పి.జి.విందా, సంగీతం: వివేక్ సాగర్, పాటలు: `సిరివెన్నెల` సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్, రచన- దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments