సమీరం ట్రైలర్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
నూతన నిర్మాణ సంస్థ అనిత క్రేయేటివ్ వర్క్స్ బ్యానర్ లో అనిత దేవేందర్ రెడ్డి, సురేష్ కేషవన్, జి.రుక్మిణి కలిసి సంయుక్తంగా తెరకెక్కుతున్న సినిమా సమీరం. కొత్త హీరో హీరోయిన్ లు యశ్వంత్, అమృత ఆచార్య నటిస్తుండగా రవి గుండబోయిన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేసారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
లిరిక్ రైటర్ రాంబాబు గోశాల మాట్లాడుతూ.. ఈ సినిమాలో అన్ని పాటలు రాసి అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు అని అన్నారు.
సంగీత దర్శకుడు యాజమాన్య మాట్లాడుతూ... ఈ సినిమాకు మంచి సంగీతం అందించే గొప్ప అవకాశం ఇచ్చిన నిర్మాత కు థాంక్స్ చెప్పారు.
హీరోయిన్ అమృత్ ఆచార్య మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు రవి గారికి థాంక్స్.. ఇంత మంచి రోల్ చేసినందుకు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. అని అన్నారు.
హీరో యశ్వంత్ మాట్లాడుతూ... ఈ సినిమా లో తన నటనకు మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర లో నటించినందుకు చాలా హ్యాపీగా ఉందని అన్నారు.
గెటప్ శ్రీను మాట్లాడుతూ.. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతకు రుణపడి ఉంటాను. ఈ మూవీ బాగా రావడానికి ముఖ్య కారణం దర్శకుడు రవి అని అన్నారు. హీరో హీరోయిన్లు బాగాచేశారు. నిర్మాతకు డబ్బుల వర్షం కురావాలని కోరుకుంటున్నా అని అన్నారు.
జబర్దస్త్ రాము మాట్లాడుతూ.. ఈ అవకాశం రవిగారికి థాంక్స్.. ప్రొడ్యూసర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
నిర్మాత అనిత దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమా మొత్తం బ్యాంకాక్ లో స్క్రిప్ట్ వర్క్ చేసాము. సినిమా కూడా అలాగే ఇక్కడే షూటింగ్ చేసాం... నాకు సహకరించిన తోటి నిర్మాత నా స్నేహితుడు డాక్టర్ సురేష్ కేషవన్ మంచి సపోర్ట్ ఇచ్చారని తన సహకారం మరువలేనిది అన్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.
దర్శకుడు రవి గుండబోయిన మాట్లాడుతూ.. తనతో పాటు పని చేసిన టెక్నీషియన్లకు కృతజ్ఞతలు తెలిపారు. సినిమా బాగా వచ్చింది.. ఇంకా మా నిర్మాత అనిత దేవేందర్ ఇచ్చిన సహకారం మరిచిపోలేనిదని అన్నారు. త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పై మంచి నమ్మకం ఉందని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments