నాడు జగన్‌కు.. నేడు బాబుకు.. సేమ్ టూ సేమ్!
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం నెట్టింట్లో రెండు ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అందులో ఒకటి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిది కాగా.. మరొకటి టీడీపీ అధినేత చంద్రబాబుది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తరిలించొద్దని రైతులు, టీడీపీ నేతలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల చంద్రబాబు తలపెట్టిన బస్సు యాత్రకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోగా.. ఆయన పోలీసుల తీరును నిరసిస్తూ.. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ నేలపైనే కూర్చోని ధర్నాకు చేశారు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అయ్యింది.
జగన్‌కు ఏం జరిగింది!?
కాగా.. గతంలో 2017 జనవరి-26న విశాఖలో క్యాండిల్ ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఎయిర్‌పోర్టులో ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జగన్ అక్కడే నేల మీద కూర్చుని నిరసన చేపట్టారు. నాడు జగన్‌కు జరిగిందే.. నేడు చంద్రబాబుకూ జరిగిందని వైసీపీ కార్యకర్తలు, జగన్ వీరాభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ.. ఇరువురూ ఇలా కూర్చొని ఉన్న ఫొటోలను వైరల్ చేస్తున్నారు. దీనికి టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తుండటంతో.. వైసీపీ వర్సెస్ తెలుగుదేశం కార్యకర్తలుగా నెట్టింట్లో పరిస్థితి నెలకొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments