మహేష్ సినిమాలోనూ అలాగే..
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకుడిగా తన తొలి ప్రయత్నం 'మున్నా' నిరాశపరిచినా.. బృందావనం, ఎవడు, ఊపిరి చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నారు వంశీ పైడిపల్లి. ఊపిరి విడుదలైన రెండేళ్ళ విరామం తరువాత తన తదుపరి చిత్రం పట్టాలెక్కుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాని.. వంశీ పైడిపల్లి తొలి మూడు చిత్రాలను తెరకెక్కించిన దిల్ రాజు నిర్మిస్తున్నారు. మరో నిర్మాతగా సి.అశ్వనీదత్ వ్యవహరిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తన గత చిత్రాల్లో కలిసొచ్చిన ఓ అంశాన్ని తన తాజా చిత్రంలోనూ రిపీట్ చేస్తున్నారు వంశీ.
ఇంతకీ అదేమిటంటే.. ఫ్రెండ్ షిప్. బృందావనంలో తన ఫ్రెండ్ కాజల్ కోసం తన లవర్ ఎన్టీఆర్‌ను వదులుకోవడానికి కూడా సిద్ధమయ్యే ఫ్రెండ్ పాత్రలో సమంత నటించిన సంగతి తెలిసిందే. ఇక ఊపిరి చిత్రం ప్రధానంగా స్నేహం చుట్టూ తిరుగుతుంది. ప్రస్తుతం.. మహేష్‌తో చేస్తున్న చిత్రంలోనూ ఫ్రెండ్ షిప్ ఓ కీలకమైన అంశం కానుంది. మహేష్, అల్లరి నరేష్ మధ్య సాగే సన్నివేశాలే ఈ సినిమాకి బలం అని తెలుస్తోంది. ఇప్పటికే స్నేహం అనే అంశాన్ని తన చిత్రాల్లో జోడించి హిట్స్ కొట్టిన వంశీ.. తాజా చిత్రంతోనూ దాన్ని కొనసాగిస్తారేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout