మ‌హేష్ సినిమాలాగే బ‌న్నీ సినిమాలో కూడా..

  • IndiaGlitz, [Thursday,May 03 2018]

ఈ వేస‌వి టాలీవుడ్‌కు బాగానే క‌లిసొచ్చింద‌నే చెప్పాలి. ‘రంగస్థలం’, ‘భరత్ అనే నేను’.. ఇలా నెల రోజుల గ్యాప్‌లో వ‌చ్చిన‌ రెండు పెద్ద‌ సినిమాలు ఇప్పటికే ఘన విజయాలు సాధించాయి. ఇక మూడో సినిమాగా అల్లు అర్జున్ నటించిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా ఈ నెల 4న విడుదల కానుంది. అయితే.. ఈ సినిమాకి, మహేష్‌ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ మూవీకి ఓ సారూప్యత ఉంది. అదేంటో ఒక్కసారి లుక్కేస్తే.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భరత్ అనే నేను’ మొత్తం “ప్రామిస్” అనే మాట చుట్టూ తిరుగుతూనే ఉంటుంది.

“ప్రామిస్ అంటే నమ్మకం, దాన్ని బ్రేక్ చేయకూడదు” అంటూ మాటకి ఉండే ప్రాముఖ్యతను చెప్పారీ చిత్రంలో. ఇక వక్కంతం వంశీ రూపొందించిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా విష‌యానికి వ‌స్తే.. “క్యారెక్టర్” చుట్టూ తిరుగుతూ ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. “క్యారెక్టర్ వదిలేయడమంటే ప్రాణాలు వదిలేయడమే.. చావు రాకముందు చచ్చి పోవడమే” అంటూ మనిషికి క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ అన్నది చెబుతున్నారు ఈ సినిమాలో. మరి “ప్రామిస్” లాగే “క్యారెక్టర్”కి కూడా ప్రేక్షకులు ఫిదా అయి.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తారేమో చూడాలి.

More News

మెహ‌రీన్‌.. ఈ ఏడాది కూడా అలాగే

‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ (2016) చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన‌ మెహరీన్..

సాహో.. బ‌డ్జెట్ పెరుగుతోందా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా యంగ్ డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘సాహో’.

మే 6న ఫాస్‌ ఫిలిం సొసైటీ - దాసరి సినీ అవార్డుల పద్రానోత్సవం

దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల సేవలందిస్తున్న ఫిలిం ఎనాలిటికల్‌ అండ్‌ అప్రిషియేషన్‌ సొసైటీ(ఫాస్‌)

ఒకే చిత్రానికి ఇద్దరు దర్శకులు!! 

మోహన్ మీడియా క్రియేషన్స్ బ్యానర్ లో 'మల్లె పువ్వు', 'మెంటల్ కృష్ణ', నంది అవార్డు పొందిన 'కలవరమాయే మదిలో' వంటి మంచి చిత్రాలను నిర్మించిన మోహన్ వడ్లపట్ల కొన్నాళ్లుగా నిర్మాతల

రామ్ చ‌ర‌ణ్ సినిమాకి అవేమీ టైటిల్స్ కాద‌ట‌

రంగ‌స్థ‌లంతో చాలా కాలం త‌రువాత బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ను సొంతం చేసుకున్నారు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.