వెంకీ, శ్రియ ఇద్దరికీ ఒకేలా..
Send us your feedback to audioarticles@vaarta.com
విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా సంచలన దర్శకుడు తేజ డైరెక్షన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా.. ఎట్టకేలకు రెగ్యులర్ షూటింగ్‌కు ముస్తాబవుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ నెల 12వ తేదీ నుంచి హైదరాబాద్ పాతబస్తీలో చిత్రీకరణ జరుపుకోనుందని తెలిసింది. సురేష్ ప్రొడక్షన్స్, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి ఆటానాదే వేటా నాదే` అనే టైటిల్ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా, ఇందులో సీనియర్ కథానాయిక శ్రియ.. గృహిణి పాత్రలో నటిస్తోంది.
ఈ సినిమా అటు వెంకటేష్‌కు, ఇటు శ్రియకు కూడా 72వ చిత్రం కావడం వార్తల్లో నిలుస్తోంది. కుటుంబ బంధాలను తెలియజేసే వైవిధ్యమైన కథతో ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించనున్నట్టు దర్శకుడు తెలియజేశారు. కాగా, ఈ చిత్రంలో యువ కథానాయకుడు నారా రోహిత్ కీలక పాత్రలో నటిస్తుండగా.. అతని సరసన ఈషా రెబ్బా నటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ మూవీని కేవలం నాలుగు నెలల్లోనే పూర్తి చేయనున్నట్టు తేజ ఇది వరకే వెల్లడించారు. అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్న ఈ చిత్రానికి రామానుజం సినిమాటోగ్రఫీ అందించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments