వెంకీ, శ్రియ ఇద్దరికీ ఒకేలా..

  • IndiaGlitz, [Saturday,March 03 2018]

విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా సంచలన దర్శకుడు తేజ డైరెక్షన్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఎప్పుడో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైన ఈ సినిమా.. ఎట్టకేలకు రెగ్యుల‌ర్ షూటింగ్‌కు ముస్తాబవుతోంది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ నెల 12వ తేదీ నుంచి హైదరాబాద్ పాతబస్తీలో చిత్రీకరణ జరుపుకోనుంద‌ని తెలిసింది. సురేష్ ప్రొడక్షన్స్, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్ప‌టికే ఈ సినిమాకి ఆటానాదే వేటా నాదే' అనే టైటిల్ ప్ర‌చారంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. కాగా, ఇందులో సీనియ‌ర్ క‌థానాయిక శ్రియ.. గృహిణి పాత్రలో నటిస్తోంది.

ఈ సినిమా అటు వెంకటేష్‌కు, ఇటు శ్రియకు కూడా 72వ చిత్రం కావడం వార్త‌ల్లో నిలుస్తోంది. కుటుంబ బంధాలను తెలియజేసే వైవిధ్యమైన కథతో ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైన‌ర్‌ను తెర‌కెక్కించ‌నున్న‌ట్టు దర్శకుడు తెలియజేశారు. కాగా, ఈ చిత్రంలో యువ క‌థానాయ‌కుడు నారా రోహిత్ కీలక పాత్రలో నటిస్తుండ‌గా.. అత‌ని సరసన ఈషా రెబ్బా నటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ మూవీని కేవలం నాలుగు నెలల్లోనే పూర్తి చేయనున్నట్టు తేజ ఇది వరకే వెల్లడించారు. అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్న ఈ చిత్రానికి రామానుజం సినిమాటోగ్రఫీ అందించనున్నారు.

More News

రవితేజ చిత్రంలో ఒకరేనట..

గత ఏడాది 'రాజా ది గ్రేట్'చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మాస్ మహారాజ రవితేజ.

పవన్, చెర్రీ తరువాత బన్నీతో..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో మరపురాని చిత్రాలలో 'అత్తారింటికి దారేది' ఒకటి. ఆ సినిమా విజయంలో సీనియర్ కథానాయిక నదియా పాత్ర కూడా ఎంతో కొంత ఉందనే చెప్పాలి. ఇండస్ట్రీ హిట్గా నిలిచిన ఈ సినిమా తరువాత.. మరో మెగా హీరో నటించిన సినిమాలోనూ ఆమె ఓ ముఖ్యమైన పాత్ర చేశారు.

శ్రీకాంత్ కాదు.. ప్రకాష్ రాజ్

శతాధిక చిత్రాల నటుడు శ్రీకాంత్..ఇటీవల ప్రాధాన్యమున్న పాత్రల్లోనూ కనిపిస్తున్న సంగతి తెలిసిందే.ఆ మధ్య గోవిందుడు అందరివాడేలే,సరైనోడు చిత్రాలలో ఆయన చేసిన పాత్రలు మంచి పేరును తీసుకువచ్చాయి.అంతేగాకుండా,గతేడాది నాగచైతన్య

చిరుకి ఫ్రెండ్.. రజనీకి శత్రువు..

మెగాస్టార్ చిరంజీవికి ఫ్రెండ్ అంటే..సూపర్ స్టార్ రజనీకాంత్ కు కూడా ఫ్రెండ్ కావాలి కదా.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభం

వరస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్,శ్రీవాస్ దర్శకత్వంలో