ఆ ఇద్దరికీ ఒకేలా..

  • IndiaGlitz, [Saturday,January 13 2018]

ఊహ‌లు గుస‌గుస‌లాడే చిత్రంలో జోడీగా న‌టించి మెప్పించిన యువ జంట నాగ‌శౌర్య‌, రాశి ఖ‌న్నా. ఆ త‌రువాత ఈ ఇద్ద‌రు క‌లిసి న‌టించిన సంద‌ర్భం లేదు. ఇదిలా ఉంటే.. ఈ ఇద్ద‌రికీ ఒకేలాంటి ప‌రిస్థితి అనుభవంలోకి రానుంది. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. నాగ శౌర్య క‌థానాయ‌కుడిగా న‌టించిన రెండు చిత్రాలు ఫిబ్ర‌వ‌రి ప్ర‌థ‌మార్థంలో వారం గ్యాప్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి.

అందులో ఒక‌టి.. హోమ్ బేన‌ర్‌లో తెర‌కెక్కిన ఛ‌లో కాగా.. మ‌రొక‌టి క‌ణం చిత్రం. ఛ‌లో ఫిబ్ర‌వ‌రి 2న ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా.. క‌ణం ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌ల కానుంది. ఇక రాశి ఖ‌న్నా విష‌యానికి వ‌స్తే.. ఈ ముద్దుగుమ్మ కూడా ఫిబ్ర‌వ‌రి ప్ర‌థ‌మార్థంలో వారం రోజుల గ్యాప్‌లో రెండు సినిమాల‌తో సంద‌డి చేయ‌నుంది. బెంగాల్ టైగ‌ర్ త‌రువాత ర‌వితేజ‌తో జోడీ క‌ట్టిన ట‌చ్ చేసి చూడు ఫిబ్ర‌వ‌రి 2న రిలీజ్ కానుండ‌గా.. వ‌రుణ్ తేజ్‌కి జంట‌గా న‌టించిన తొలి ప్రేమ చిత్రం ఫిబ్ర‌వ‌రి 9న తెర‌పైకి రానుంది. ఈ మ‌ధ్య కాలంలో స‌రైన విజ‌యాలు లేని ఈ ఇద్ద‌రికీ ఈ సినిమాల‌తోనైనా విజ‌యాలు అందుతాయేమో చూడాలి.