సమంత 'యూ టర్న్' సక్సెస్ మీట్..!!

  • IndiaGlitz, [Tuesday,September 18 2018]

సమంత ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం 'యూ టర్న్'.. మిస్టరీ థ్రిల్లర్ జోన్ గా వస్తున్న ఈ సినిమా గత శుక్రవారం రిలీజ్ కాగా సినిమా మంచి సక్సెస్ అయ్యింది.. పవన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా లో ఆది పినిశెట్టి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా, భూమిక చావ్లా, హీరో రాహుల్ రవీంద్రన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్, వి. వై. కంబైన్స్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి , రాంబాబు బండారు లు ఈ సినిమాను నిర్మించారు. కాగా నిన్న హైదరాబాద్ లో సినిమా విజయోత్సవ వేడుక జరిగింది.. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కవిత , డైరెక్టర్ నందినిలు ముఖ్య అతిధులుగా వచ్చారు.

నటుడు రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ.. కమర్షియల్ సినిమాలు మాత్రమే ప్రేక్షకులు చూస్తున్నారు అన్న అపోహ ఇప్పుడు లేదు.. మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమా , పెద్ద సినిమా ఏదైనా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ప్రొడ్యూసర్స్ గారికి మంచి టెస్ట్ ఉంది.. ఇంత మంచి సినిమా మొదటి సినిమా గా తీయడం వారికే చెల్లింది.. సినిమాని ఇంత విజయవంతం చేసినందికి ప్రేక్షకులకు చాల థాంక్స్ అన్నారు..

డైరెక్టర్ పవన్ కుమార్ మాట్లాడుతూ.. సినిమా విజయం సాధించినందుకు చాల హ్యాపీ గ ఉంది.. తెలుగు , తమిళ్లో వచ్చిన ఈ సినిమా రెండు భాషల్లో మంచి హిట్ అయ్యింది.. ప్రేక్షకులకు ధర్న్యవాదాలు.. సమంత సినిమా లో చాల బాగా చేసింది.. మ్యూజిక్ కి మంచి మార్కులుపడ్డాయి.. అన్నారు.

కవిత గారు మాట్లాడుతూ.. ఈ సినిమా కి పనిచేసిన అందరికి మంచి విజయం దక్కింది.. వండర్ ఫుల్ సినిమా ఇది.. చూసిన ప్రతి ఒక్కరు సినిమా చాల బాగా ఉంది అంటున్నారు.. సమంత ఈ సినిమాలో చాల డిఫరెంట్ కనిపించింది.. రంగస్థలంలో , యూ టర్న్ లో చాల వేరియేషన్స్ చూపించింది.. సమంత సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా చాల మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి.. డిఫరెంట్ స్టోరీస్ ఉన్న సినిమాలను ప్రతి ఒక్కరు ఆదరిస్తారు అనడానికి ఈ సినిమానే ఉదాహరణ.. చాల మంచి సినిమా ఇలాంటి సినిమాని అందరు ఆదరించాలి.. అన్నారు..

డైరెక్టర్ నందిని మాట్లాడుతూ.. కొంతమంది డైరెక్టర్ ల సినిమా లు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తుంటాను అలాంటి డైరెక్టర్ లలో పవన్ కుమార్ గారు ఒకరు.. అయన మేకింగ్ చాల డిఫరెంట్ గా ఉంటుంది.. అయన లూసియా సినిమా చూసాను .. చాల బాగుంది.. అప్పటినుంచి అయన సినిమాలు చూడడం మొదలుపెట్టాను.. అయన తెలుగులోకి కూడా రావడం చాల ఆనందంగా ఉంది.. ఈ సినిమా లో పనిచేసిన అందరికి కంగ్రాట్స్. సమంత చాల కష్టపడే వ్యక్తి.. ఆమెకు ఈ విజయం దక్కాలి.. మంచి సినిమా వస్తే ప్రతి ఒక్కరు ఆదరిస్తారు.. అన్నారు..

ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. సినిమా ని ఇంత హిట్ చేసినందుకు అందరికి థాంక్స్..మా సినిమా ని సపోర్ట్ చేసినందుకు మీడియా కి, రివ్యూయర్స్ కి చాల చాల కృతజ్ఞతలు.. నేను చేసిన సినిమాల్లో ఇంత పాజిటివ్ రివ్యూస్ రావడం , నా యాక్టింగ్ కి రావడం చాల ఆనందంగా ఉంది.. ఇక్కడికి వచ్చిన కవిత గారికి, డైరెక్టర్ నందికి గారికి చాల థాంక్స్.

ఇంత మంచి సినిమా తీసిన ప్రొడ్యూసర్స్ కి కృతజ్ఞతలు.. వాళ్ళ ఫస్ట్ సినిమా గా ఇది చేసినందుకు గర్వంగా ఉంది.. నా కెరీర్ లో మంచి సినిమా ఇచ్చిన డైరెక్టర్ పవన్ కి చాల థాంక్స్.. ఈ సినిమా తో మూడు స్టేట్స్ లో సక్సెస్ కొట్టాడు.. ఇది మొదలు మాత్రమే.. ఆయనలో ఇంకా చాల టాలెంట్ ఉంది.. ఈ చిత్రంలో నటించిన అందరికి శుభాకాంక్షలు.. సినిమా చుసిన ప్రేక్షకులు తప్పకుండ థ్రిల్ గురవుతున్నారు.. సినిమా ని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదాలు.. అన్నారు..

More News

మెగాస్టార్ మెచ్చిన 'ప్యార్ ప్రేమ కాదల్'

ప్రముఖ సంగీత దర్శకుడు  యువన్ శంకర్ రాజా నిర్మాతగా తెరకెక్కించిన‌ చిత్రం 'ప్యార్ ప్రేమ కాదల్'. తమిళనాట ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని ద‌ర్శ‌క‌నిర్మాత‌ తమ్మారెడ్డి భరద్వాజ

మాజీ ల‌వ‌ర్‌కు షాకిచ్చేసిందిగా..!

ర‌ష్మిక.. హీరో ర‌క్షిత్ ఎంగేజ్‌మెంట్ రీసెంట్‌గా బ్రేక‌ప్ అయిన సంగ‌తి తెలిసిందే. రీసెంట్‌గా త‌న ప‌ని త‌న‌ను చేసుకోవాల్సిందిగా.. డిస్ట్ర‌బ్ చేయ‌వ‌ద్ద‌ని ర‌క్షిత్ స‌హా సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్

ట్రెండ్ క్రియేట్ చేస్తున్న అమితాబ్ లుక్

బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌, మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్ న‌టిస్తున్న చిత్రం 'థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్‌'. విజ‌య్ కృష్ణ ఆచార్య ద‌ర్శ‌కుడు.

బ్రేక‌ప్‌పై ర‌ష్మిక స్పంద‌న‌..

న‌టుడు ర‌క్షిత్‌తో నిశ్చితార్థం జ‌రిగిన త‌ర్వాత హీరోయిన్‌గా బిజీ అయిపోవ‌డం .. ఇత‌ర కార‌ణాల‌తో ఎంగేజ్‌మెంట్ బ్రేక‌ప్ అయింది.

నెట్‌ఫ్లిక్స్ సిరీస్ శివ‌గామి ఎవ‌రంటే?

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లైన 'బాహుబ‌లి' చిత్రంలో రాజ‌మాత శివ‌గామిగా ర‌మ్య‌కృష్ణ న‌ట‌న అందరి మ‌న్న‌న‌లు అందుకుంది.