నయన్,నిత్య మిస్.. సమంత యస్..

  • IndiaGlitz, [Saturday,January 27 2018]

2016లో విడుదలైన యు-టర్న్' సినిమా శాండల్ వుడ్‌లో సంచలన విజయం సాధించింది. తెలుగులో ఈ సినిమాని రీమేక్ చేయాల‌నుకున్న‌ప్పుడు.. శ్రద్ధా శ్రీనాథ్ పోషించిన రిపోర్టర్ పాత్ర కోసం తొలుత‌ సమంతని సంప్రదించిందట చిత్ర నిర్మాణ బృందం. అయితే అప్పటికే సమంత పెళ్లి వ్య‌వ‌హారాలు న‌డుస్తుండ‌డంతో.. ఈ మూవీ షూటింగ్ విషయంలో జాప్యం జరుగుతుందని భావించి దక్షిణాదిన స్టార్ హీరోయిన్స్ అయిన నయనతార, నిత్యమీనన్ కూడా సంప్రదించారట.

కాని బిజీ షెడ్యూల్స్ కార‌ణంగా కాల్షీట్ల స‌మ‌స్యతో నయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోగా...నిత్య కూడా కొన్ని కారణాల వలన చేయలేనని చెప్పడంతో...మళ్ళీ సమంత వద్దకే ఈ సినిమా వచ్చి చేరడం విశేషం. ఇప్పుడు ఈ థ్రిల్లర్ మూవీని సమంత క‌థానాయిక‌గా.. తెలుగు, తమిళ భాషల్లో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై నిర్మించనుండడం గమనార్హం. మాతృకకి దర్శకత్వం వహించిన పవన్ కుమార్ ఈ రెండు వెర్ష‌న్‌ల‌ను రూపొందించనున్నారు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి పోలీస్ అధికారి పాత్రలో కనిపించనుండగా...రాహుల్ రవీంద్రన్, సమంత బాయ్ ఫ్రెండ్ గా నటించనున్నారు. ఇక వీరితో పాటు సీనియర్ నాయికలు శ్రియ, భూమిక కూడా ముఖ్య పాత్రల్లో మెరవనున్నారని ఇన్‌సైడ్‌ సోర్స్ టాక్. కాగా, ఈ సినిమా ఫిబ్రవరి ఆఖరి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

More News

'ఇంటిలిజెంట్ 'టీజర్ ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అన్నంత బాగుంది - బాలకృష్ణ

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై

నెల్లూరి పెద్దారెడ్డి ఆడియో విడుదల...

సిద్ధి విఘ్నేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దర్శకులు వీజే రెడ్డి రూపొందిస్తున్న చిత్రం నెల్లూరి పెద్దారెడ్డి. సీహెచ్ రఘునాథ రెడ్డి నిర్మాత. సతీష్ రెడ్డి, మౌర్యాని, ముంతాజ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రభాస్ శీను, అంబటి శీను, సమ్మెట గాంధీ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

కృష్ణం రాజు చేతుల మీదుగా 'ఆప‌రేష‌న్ 2019' టీజ‌ర్ లాంచ్‌!!

శ్రీకాంత్‌, య‌జ్ఞశెట్టి  హీరో హీరోయిన్లుగా  అలివేల‌మ్మ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై క‌ర‌ణం బాబ్జి ద‌ర్శ‌కత్వంలో అలివేలు నిర్మిస్తున్న చిత్రం 'ఆప‌రేష‌న్ 2019'. 'బివేర్ ఆఫ్ ప‌బ్లిక్‌' అనేది ట్యాగ్ లైన్‌. ఈ చిత్రం టీజ‌ర్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది.

నవలాధారంగా ఎన్టీఆర్ సినిమా?

త్రివిక్రమ్ శ్రీనివాస్..తెలుగు చిత్ర సీమలో సంచలనం సృష్టించిన మాటల రచయిత.

చిరుని అలా టార్గెట్ చేసిన వినాయక్

నృత్యాలకి పెట్టింది పేరు మెగాస్టార్ చిరంజీవి.