నయన్,నిత్య మిస్.. సమంత యస్..

  • IndiaGlitz, [Saturday,January 27 2018]

2016లో విడుదలైన యు-టర్న్' సినిమా శాండల్ వుడ్‌లో సంచలన విజయం సాధించింది. తెలుగులో ఈ సినిమాని రీమేక్ చేయాల‌నుకున్న‌ప్పుడు.. శ్రద్ధా శ్రీనాథ్ పోషించిన రిపోర్టర్ పాత్ర కోసం తొలుత‌ సమంతని సంప్రదించిందట చిత్ర నిర్మాణ బృందం. అయితే అప్పటికే సమంత పెళ్లి వ్య‌వ‌హారాలు న‌డుస్తుండ‌డంతో.. ఈ మూవీ షూటింగ్ విషయంలో జాప్యం జరుగుతుందని భావించి దక్షిణాదిన స్టార్ హీరోయిన్స్ అయిన నయనతార, నిత్యమీనన్ కూడా సంప్రదించారట.

కాని బిజీ షెడ్యూల్స్ కార‌ణంగా కాల్షీట్ల స‌మ‌స్యతో నయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోగా...నిత్య కూడా కొన్ని కారణాల వలన చేయలేనని చెప్పడంతో...మళ్ళీ సమంత వద్దకే ఈ సినిమా వచ్చి చేరడం విశేషం. ఇప్పుడు ఈ థ్రిల్లర్ మూవీని సమంత క‌థానాయిక‌గా.. తెలుగు, తమిళ భాషల్లో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై నిర్మించనుండడం గమనార్హం. మాతృకకి దర్శకత్వం వహించిన పవన్ కుమార్ ఈ రెండు వెర్ష‌న్‌ల‌ను రూపొందించనున్నారు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి పోలీస్ అధికారి పాత్రలో కనిపించనుండగా...రాహుల్ రవీంద్రన్, సమంత బాయ్ ఫ్రెండ్ గా నటించనున్నారు. ఇక వీరితో పాటు సీనియర్ నాయికలు శ్రియ, భూమిక కూడా ముఖ్య పాత్రల్లో మెరవనున్నారని ఇన్‌సైడ్‌ సోర్స్ టాక్. కాగా, ఈ సినిమా ఫిబ్రవరి ఆఖరి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.