అడవిశేష్తో సమంత
- IndiaGlitz, [Wednesday,September 21 2016]
స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న తరుణంలో సమంత అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకోనుందని అనధికారకంగా వార్తలు వచ్చాయి. దాదాపు వచ్చే ఏడాది చైతు, సమంతల వివాహం జరగనుంది. అయితే పెళ్ళి కారణంగానే సమంత సినిమాల సంఖ్య తగ్గించుకుంటుందని కూడా ఫిలింనగర్లో న్యూస్ వస్తుంది.
మరి అలాంటిది ఈ ఏడాది క్షణంతో హిట్ కొట్టిన అడవిశేష్తో సమంత జత కట్టడమేంటనే డౌట్ రావచ్చు. అయితే అసలు విషయం ఏంటంటే సమంత, అడవిశేష్లు కలసి సౌతిండియా షాపింగ్ మాల్ యాడ్లో నటించారు అదన్నమాట సంగతి. ప్రస్తుతం అడవిశేష్ శశిటిక్క, రాహుల్ దర్శకత్వంలో 'గూడఛారి' సినిమాతో బిజీగా ఉన్నాడు.